Home రాజకీయాలు ట్రాన్స్‌జెండర్‌గా అలరించిన శివప్రసాద్..

ట్రాన్స్‌జెండర్‌గా అలరించిన శివప్రసాద్..

244
SHARE

రోజుకో పగటివేషంలో పార్లమెంట్ వద్ద వినోదం పంచుతున్న ఎంపీ శివప్రసాద్‌.. ఇప్పుడు ఏకంగా ట్రాన్స్‌ జెండర్ వేషం కట్టారు. తోటి ఎంపీ ఇలా పగటివేషం వేయడంచూసి కొందరు ఎంపీ నవ్వుకుంటుంటే… మరికొందరు మాత్రం ఇది పార్లమెంట్ ప్రతిష్టను దిగజార్చడమేనంటున్నారు.

అయినా శివప్రసాద్‌మాత్రం తగ్గడం లేదు. తన పగటివేషాలతో పోరాటం కొనసాగిస్తున్నారు. ట్రాన్స్ జెండర్‌ వేషం వేసిన శివప్రసాద్‌కు సోనియా గాంధీ సంఘీభావం ప్రకటించారు. కొత్త బంధుత్వానికి అనురాగాలు ఎక్కువ తరహాలో ట్రాన్స్‌జెండర్‌ వేషం వేసిన శివప్రసాద్‌తో కలిసి గేట్ వద్ద ఉన్న టీడీపీ ఎంపీలను సోనియా గాంధీ దగ్గరకు వెళ్లి మరీ పలకరించారు.

వారి మంచిచెడులు అడిగి తెలుసుకున్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి టీడీపీ అండగా నిలవడంతో రెండుపార్టీల మధ్య బంధం మరింత బలపడింది. మొత్తం మీద కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ పార్టీ స్థాపిస్తే చంద్రబాబు మాత్రం పొత్తుపోరాటాల్లో భాగంగా కాంగ్రెస్‌ చేతికి సైకిల్ అప్పగించేశారు.