Home రాజకీయాలు ‘ఈడీ చార్జిషీటులో భారతి’ వార్తపై జగన్ బహిరంగ లేఖ

‘ఈడీ చార్జిషీటులో భారతి’ వార్తపై జగన్ బహిరంగ లేఖ

139
SHARE

పెట్టుబడుల కేసులో తన భార్య భరతి పేరు తెరపైకి తీసుకు రావడంపై విపక్ష నేత, వైకాపా అదినేత జగన్ బహిరంగ లేఖ రాశారు. తన లేఖలో జగన్ ముఖ్యమంత్రి తెదేపా అదినేత చంద్రబాబునాయుడు ఈడీ ని మేనేజ్ చేస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈడి అదికారులు ఇద్దరిని టిడిపి నేతలు మేనేజ్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు తన తండ్రి వై ఎస్ రాజశేఖరరెడ్డిని, తర్వాత తనను టార్గెట్ చేశారని, ఇప్పుడు తన భార్యను కూడా టార్గెట్ చేసి ఈడీ అదికారులపై పలుకుబడి ఉపయోగిస్తున్నారని జగన్ తెలిపారు.

జడ్జి పరిగణనలోకి తీసుకొంత వరకూ చార్జీషీట్ లో విషయాలు బయటకు రావని, అలాంటిది ముందుగానే ఎల్లో మీడియాకు, ఒకటి రెండు ఆంగ్ల పత్రికలకు ఎలా తెలిశాయని జగన్ ప్రశ్నించారు.

సిబిఐ విచారణలో లేని వ్యక్తుల పేర్లను ఇన్నేళ్ల తర్వాత చార్జీషీట్ లో చేర్చటం పై జగన్ అనుమానం వ్యక్తం చేశారు. తన కుటుంబాన్ని టార్గెట్ చేయవలసిన అవసరం ఎవరికి ఉంటుందని, అసలు తన భార్యకు ఈ కేసులతో సంబందం ఏంటని ఆయన ప్రశ్నించారు.

చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా ఇద్దరు అధికారులు ఉమాశంకర్ గౌడ్, గాందీ తనని వేధిస్తున్న విషయం తాను ఇప్పటికే ప్రదాని కి ఫిర్యాదు చేశానని కూడా జగన్ గుర్తుచేశారు. గాందీ అన్న అధికారి బదిలీ అయిన తర్వాత కూడా మూడుసార్లు తన గడువు పొడిగించుకోగలిగారని, దీనిని కేంద్రం కూడా ఆమోదించిందని అన్నారు. ఒకవేళ తనకు బిజెపి కి టీడీపీ ఆరోపిస్తున్నట్టు సంబంధాలు ఉండి ఉంటే ఇలా జరిగే అవకాశం ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు.

గతంలో కాంగ్రెస్ టిడిపి లు కలిసి కక్షగట్టి తనపై కేసులు వేశాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కున్నానని జగన్ అన్నారు. బాబు పగలు కాంగ్రెస్తో, రాత్రివేళ బిజెపి తో సంసారం చేస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు బిజెపితో ఇప్పటికీ సంబంధాలు నెరుపుతున్నారు అనటానికి పలు ఉదాహరణలు కనిపిస్తాయని జగన్ అన్నారు. అలానే వ్యవస్థలను కూడా చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారని జగన్ పేర్కొన్నారు.

ప్రతిపక్షాలను ఎదుర్కోనే శక్తీ లేక వ్యవస్థలను మేనేజ్ చేయడం ద్వారా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని అన్నారు. బిజెపి తో సంబందాల వల్లే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తప్పించుకుని తిరగ గలుగుతున్నారని జగన్ అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజాస్వామ్యానికి రక్షణ అనేది ఉంటుందా అని జగన్ ప్రశ్నించారు.