Home రాజకీయాలు ముస్లిం ల వద్ద గోద్రా ప్రస్తావన తీసుకొచ్చిన బాబు

ముస్లిం ల వద్ద గోద్రా ప్రస్తావన తీసుకొచ్చిన బాబు

74
SHARE

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో గుజరాత్ లోని గోద్రా అల్లర్లను తిరగతోడుతున్నట్టు వుంది. తెదేపా ప్రత్యేకంగా ముస్లిం ల సమావేశం నిర్వహించడం విశేషం అనుకుంటే ఆ సమావేశంలో చంద్రబాబు ప్రసంగిస్తూ గోద్రా ని ప్రస్తావించారు.

తాను ఆ సమయంలో గోద్రా అల్లర్లలో నాటి గుజరాత్ సీఎం గా ఉన్న నరేంద్ర మోదీ రాజీనామా కు ఎంత గట్టిగా పట్టుబట్టారో గుర్తు చేశారు. ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వాల్సిన బాధ్యత కూడా తనపై ఉందన్నారు. అయితే అందరి మనోభావాలు పరిగణనలోకి తీసుకున్నతర్వాత ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

బానే సెలవిచ్చారు గాని…మరి 2014లో చంద్రబాబు బిజెపి తో ముఖ్యం గా మోడీ తో ఎలా జతకట్టారో సెలవిచ్చి ఉంటే పోయేది. పోనీ మరో సారి మోడీ తో తెదేపా జత కట్టదని బాబు గారంటీ ఇవ్వగలరా…??