Home రాజకీయాలు డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో వైసీపీ తాజా కీలక నిర్ణయం

డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో వైసీపీ తాజా కీలక నిర్ణయం

SHARE

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికకు గైర్హాజరవ్వాలని నిర్ణయించుకుంది. ఈవిషయాన్నివైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు.

ప్రతిపక్షాల తరపున ఏ పార్టీ అభ్యర్థిని నిలబెట్టినా మద్దతు ఇవ్వాలని అనుకున్నామని చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్‌ను నాశనం చేసిన కాంగ్రెసే సొంతంగా అభ్యర్థిని నిలబెట్టిన నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించినట్టు చెప్పారు.

నిన్నటి వరకు కాంగ్రెస్ నుంచి కాకుండా ఇతర ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిని దింపుతామని చెప్పారని.. ఇప్పుడు నేరుగా కాంగ్రెస్ అభ్యర్థే బరిలో ఉన్నందున తాము మద్దతు ఇవ్వబోమన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ మూడు ద్రోహం చేశాయన్నారు. కాబట్టి ఈమూడు పార్టీలకు తాము మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. ప్రత్యేక హోదా 15సంవత్సరాలు ఇస్తామని చెప్పి బీజేపీ మోసం చేసిందన్నారు.

రాష్ట్ర ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఎన్నికల్లో గైర్హజరవ్వాలని నిర్ణయించినట్టు విజయసాయిరెడ్డి చెప్పారు.