Home సినిమా సైరా లో మెరవనున్న స్టైలిష్ స్టార్..!!

సైరా లో మెరవనున్న స్టైలిష్ స్టార్..!!

SHARE

మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న‘సైరా నరసింహ రెడ్డి’ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మాణంలో వుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసి౦దే. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో వేసిన భారీ సెట్ లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. మూవీ లో కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి, నయనతార, జగపతిబాబు, బిగ్ బి అమితాబ్, బ్రహ్మాజీ నటిస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా ఈ స్టార్ కాస్ట్ కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరు జత చేయాలి. బన్నీ అతిధి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

రుద్ర‌మ‌దేవిలో గోన గ‌న్నారెడ్డిగా అల‌రించిన అల్లు అర్జున్ సైరాలోను క‌త్తి ప‌ట్టి వీరుడు లా కనిపించబోతున్నట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే ఇంకా అఫిషియల్ గా తెలియదు.

ఇక పోతే కొన్ని రోజుల క్రితం సైరా కోసం వేసిన సెట్స్ ను మున్సిపల్ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. కానీ సైరా యూనిట్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మరోచోట అదే సెట్ ను ఏర్పాటు చేసుకోగలిగారు. మొన్న మంగళవారం నుండి కొత్త సెట్ లో సైరా షూటింగ్ మొదలు పెట్టుకుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. బన్నీ ఫాన్స్ మాత్రం చిరు సినిమా లో తమ స్టార్ చేయటం అంటే ఎంతో ఎక్సైట్ అవుతున్నారు.