Home రాజకీయాలు వేటును లైట్ తీసుకున్న నేదురుమల్లి రాంకుమార్

వేటును లైట్ తీసుకున్న నేదురుమల్లి రాంకుమార్

58
SHARE

త్వరలోనే వైసీపీ చేరబోతున్నట్టు ప్రకటించారు నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి కుమారుడు రాంకుమార్ రెడ్డి. వారం క్రితమే పాదయాత్రలో ఉన్న జగన్‌ను కలిసిన రాంకుమార్‌ రెడ్డి… తన అనుచరులు, ఆత్మీయులతో నెల్లూరులో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా తాను వైసీపీలో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు. కార్యకర్తల అభీష్టం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.

మరోవైపు నేదురుమల్లి రాంకుమార్‌ రెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధమవడంతో బీజేపీ ఆయనపై బహిష్కరణ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆయనపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం వేటు వేసింది.

ఇటీవలే ఆయన్ను ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆ మరుసటి రోజే రాంకుమార్ రెడ్డి వైఎస్ జగన్‌ను కలిశారు. బీజేపీకి రాజీనామా చేసేందుకు రాంకుమార్‌ రెడ్డి సిద్ధమవుతున్న తరుణంలోనే బీజేపీ అంతకంటే ముందే వేటు వేసింది. అయితే ఈ వేటును రాంకుమార్ రెడ్డి, ఆయన అనుచరులు లైట్ తీసుకున్నారు.