Home రాజకీయాలు ఎంట్రీతోనే సెంట్రల్ షేక్ మరిచావా…

ఎంట్రీతోనే సెంట్రల్ షేక్ మరిచావా…

52
SHARE

జగన్ అసెంబ్లీ నుంచి పారిపోయాడంటూ పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఫైర్ అయ్యారు. గుంటూరులో జరిగిన వంచనపై దీక్షలో ప్రసంగించిన అనిల్.. చరిత్ర గుర్తించుకుని జగన్‌ గురించి మాట్లాడాలన్నారు. జగన్ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన వెంటనే కేంద్రమే గడగడలాడిన విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు. సోనియాను ఎదురించేందుకు పెద్దపెద్ద వాల్లే ఉచ్చపోసుకుంటుంటే ఆ సమయంలో సోనియానే ఢీకొట్టిన వ్యక్తి జగన్ అన్నారు.

చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం లేని వ్యక్తా జగన్‌ గురించి మాట్లాడేది అని అనిల్ కుమార్ విరుచుకుపడ్డారు. ఎప్పుడైనా సరే ఒంటరిగా పోటీకి దిగేందుకు రెడీగా ఉన్న పార్టీ వైసీపీ అన్నారు అనిల్ కుమార్ యాదవ్. రాష్ట్రంలో మగాడు ఒకవైపు ఉంటే .. మిగిలిన వైపు ఎంతమంది ఉన్నారో అందరికీ తెలుసన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌, టీడీపీ, జనసేన, లోక్‌సత్తా అన్ని పార్టీలు కలిసి వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధమన్నారు.

రాష్ట్రానికి గ్రహణం పట్టిందని.. అందుకే పప్పు లోకేష్‌ చెప్పే మాటలు కూడా వినాల్సి వస్తోందన్నారు. మీ తండ్రి బతుకంతా వెనుక నుంచి పొడవడమే కానీ ఒక్కసారైనా ముందు నుంచి పోరాటం చేశారా అని లోకేష్ ను ప్రశ్నించారు. జగన్‌ను వంచాలనుకుంటే అది పొరపాటేనన్నారు అనిల్. 2019లో ఎవరిని ఎన్నుకోవాలన్న దానిపై ప్రజలు ఇప్పటికే ఒక నిర్దారణకు వచ్చేశారన్నారు.