Home ప్రత్యేకం ఏంటీ డిస్కౌంట్ ల వేలం వెర్రి

ఏంటీ డిస్కౌంట్ ల వేలం వెర్రి

SHARE

మన జనాల కక్కుర్తి కి అంతం లేదు…IKEA స్టోర్ వద్ద వేలం వెర్రి దానికి సాక్ష్యం. డిస్కౌంట్ అనే మాట చాలు మన జనాలకి…ఎక్కడలేని శక్తీ వచ్చేస్తుంది …ఇదిగో హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఐకియా స్టోర్ వద్ద జనం తొక్కిసలాట జరిగింది.

అంతర్జాతీయ ఫర్నిచర్ సంస్థగా ఐకియా కి బాగా పేరుంది…IKEA ఇండియా లోనే తొలి స్టోర్ హైదరాబాద్ లో ప్రారంభించింది. ఈ సందర్భంగా వెయ్యి వస్తువులపై ధర తగ్గింపు ఆఫర్ …బయ్ వన్ గెట్ వన్ ఆఫర్ లు ప్రకటించింది స్టోరు. ఇంకేముంది తంబాలు గా జనాలు ఎగబడ్డారట. బారికేడ్లను కూడా తోసుకు౦టు లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారట.

ఆ తోపులాటలో కొంత మంది గాయపడట౦ జరిగింది. హైటెక్‌ సిటీకి చేరువలో మైండ్‌స్పేస్‌కు దగ్గర దాదాపుగా 1000 కోట్ల వ్యయంతో 4లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వారి స్టోర్‌ ఏర్పాటు చేసింది.