Home రాజకీయాలు వైసీపీలోకి దాసరి కుమారుడు

వైసీపీలోకి దాసరి కుమారుడు

SHARE

వైసీపీలోకి చిత్రపరిశ్రమ నుంచి చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పోసాని కృష్ణమురళీ, పృధ్వీ, కృష్ణుడు వైసీపీ కోసం పనిచేస్తుండగా మరికొద్ది రోజుల్లో దాసరి నారాయణరావు కుమారుడు కూడా వైసీపీలో చేరబోతున్నారు. ఈ విషయాన్ని గుంటూరులో జరిగిన వంచన దీక్షలో నటుడు పృథ్వీ వివరించారు.

తనను, పోసానిని కొందరు ఫెయిడ్‌ అంటూ విమర్శిస్తున్నారని.. వాటిని తాము పట్టించుకోబోమన్నారు. బచ్చాలు కొన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు.

తామే కాదు త్వరలో దాసరి నారాయణరావు కుమారుడు కూడా వైసీపీలో చేరబోతున్నారని ఆయన వివరించారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని.. ఆ తర్వాత 30ఏళ్ల పాటు పార్టీ అధికారంలో ఉంటుందన్నారు.

40ఇయర్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు.. 40ఏళ్ల జగన్‌ను చూసి ఎందుకు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌ సమస్యల నుంచి పారిపోయే వ్యక్తి కాదన్నారు పృథ్వీ.