Home రాజకీయాలు ఘరానా సిఎం: 17గంటలకి బాబు గారి ఖర్చు అక్షరాలా 8.7 లక్షలు

ఘరానా సిఎం: 17గంటలకి బాబు గారి ఖర్చు అక్షరాలా 8.7 లక్షలు

SHARE

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి రాష్ట్రంలో పర్యటించినా, ఇతర రాష్ట్రాలకు వెళ్లినా, విదేశాలకు వెళ్లినా ఖర్చు మాత్రం తడిసి మోపెడు అవుతోంది.ఈ మద్య ఆయన కర్నాటకలో ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు వెళ్లారు. ఆ సందర్భంగా ఆయన హోటల్ ఖర్చు ఏకంగా 8.7 లక్షల రూపాయలు అయిందట.

ఇది ఒక్కరోజు వ్యయమే.దీనిపై బెంగుళూరు మిర్రర్ ఒక ఆసక్తికర కదనం ఇచ్చింది.కర్నాటక ప్రభుత్వం ఈ మొత్తాన్ని చెల్లించింది. గతంలో సిద్దరామయ్య,అంతకుముందు ఎడ్యూరప్పలు ముఖ్యమంత్రులుగా బాద్యతలు తీసుకున్నప్పుడు ప్రభుత్వానికి రూపాయి కూడా అతిదుల కోసం ఖర్చు పెట్టలేదు.కాని ఈసారి కుమార స్వామి ప్రభుత్వం మాత్రం ముప్పై ఏడు లక్షల రూపాయలు వ్యయం చేసిందట.

RTI కింద ఈ సమాచారం సేకరించారు.కాగా డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు 1.85 వేల రూపాయలు, ఇతర నేతలకు సగటున ఒక లక్ష రూపాయలు వ్యయం అయిందట.ఇక్కడ విశేషం ఏమిటంటే చంద్రబాబు మేఇరవై మూడో తేదీన ఉదయం 9:49 నిమిషాలకు తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్ లో దిగిన ఆయన మే ఇరవైనాలుగో తేదీ ఉదయం 5.34 గంటలకు ఖాళీ చేశారు.

అంటే 17గంటలకు గాను 8.7 లక్షల రూపాయలు బాబు ఖర్చు చేశారంటే ఈయన ఘరానా సిఎం అని కర్నాటక ప్రజలు అనుకుని వుంటారు అన్నమాట.