Home రాజకీయాలు జగన్ అంటే వీరికి ఎంత ప్రేమ…!!

జగన్ అంటే వీరికి ఎంత ప్రేమ…!!

SHARE

వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం లోని రౌతులపూడి శివారు నుంచి ప్రారంభమై గిడిజామ్, ఎస్.అగ్రహారం మీదుగా పారుపాక క్రాస్ వరకు కొనసాగింది. అయితే, డీజేపురం వరకు పాదయాత్ర కొనసాగాల్సి ఉ౦డగా వర్షం కారణంగా ఉదయం పూట యాత్ర రద్దు కావడంతో కుదించటం జరిగింది.

అందువల్ల రోజంతా రౌతులపూడి మండలం లోనే జగన్ యాత్ర కొనసాగించారు. అయితే గిడిజామ్ ప్రాంతానికి జగన్ చేరుకోగానే ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. జగన్ వచ్చే మార్గంలో గ్రామస్తులు వరుసగా చీరలు పరిచి ఆశ్చర్య పరిచారు. వాటిపై జగన్ నడుచుకుంటూ వెళ్లారు. ఈ సందర్భంగా జగన్ తో ప్రజలు తమ సమస్యలు చెప్పుకున్నారు. అక్కడ వున్నా పోలీసులు సైతం ఈ చర్యకి ఆశ్చర్యపోయారు!!