Home రాజకీయాలు ఒక్కసారి…చివరి…సారి నాన్నా అని పిలవనా..!

ఒక్కసారి…చివరి…సారి నాన్నా అని పిలవనా..!

44
SHARE

ప్రజల తో మమేకమై…ప్రజా నాయకుడిగా వెలుగొందట౦ అంత సులభం కాదు…అందరి వల్లా కాదు…కానీ అలా వుంది అమరుడైన తన తండ్రి ని ఉద్దేశిస్తూ మరో ప్రజానాయకుడు…ఆయన కి కొడుకు అయినా స్టాలిన్ రాసిన భావోద్వేగ లేఖలో నాన్నా అన్న మాట గుండెల్ని పిండేసేదే.

నాన్నా ..నిన్ను ఒకసారి నాన్నా అని పిలుస్తా అంటూ స్టాలిన్ రాసిన లేఖ అందరిని ఆకర్షిస్తోంది…..తండ్రిని కోల్పోయిన వారితో కన్నీరు తెప్పిస్తోంది….చివరి సారి నాన్నా అని పిలుస్తానని స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు.

ఇన్నాళ్లూ నాన్నా అనకు౦డా అందరిలా తనూ తలైవర్ (అంటే నాయకుడు) అనే ఎక్కువసార్లు పిలిచే వాడినని స్టాలిన్ గుర్తు చేసుకున్నారు. ఎప్పుడూ ఎక్కడకు వెళ్లినా చెప్పి వెళ్లే నీవు ఈసారి చెప్పకుండా వెళ్లిపోయావని ఆవేదన తో రాసిన మాటలు…కారాదు కట్టిన గుండెల్ని సైతం పిండేస్తోంది. 33 ఏళ్ల క్రితం సమాధి గురించి మీరు చెప్పిన వాఖ్యలు నాకు బాగా గుర్తుకు ఉన్నాయి.

ఎవరైతే విశ్రాంతి లేకుండా పని చేస్తారో వారు ఇక్కడ(సమాధి) విశ్రాంతి పొందుతారు’ అని చెపారు. మీరు తమిళ ప్రజల కోసం విశ్రాంతి లేకుండా కృషి చేసి సంతృప్తితో అక్కడికి (సమాధి లో) సేద తీరడానికి వెళ్లారని ఆశిస్తున్నా’ అని స్టాలిన్ కూడా భావోద్వేగంతో లేఖ రాసారు.