Home రాజకీయాలు కాంగ్రెస్ తెదేపా దోస్తానా..!!

కాంగ్రెస్ తెదేపా దోస్తానా..!!

SHARE

తెలుగుదేశం పార్టీ రాజకీయ ఎత్తుగడలు అంతుపట్టని విధంగా ఉంటాయి. సైద్ధాంతికపరంగా తెదేపా కి కాంగ్రెస్ కి బద్ధ వైరం వున్నా ….జరుగుతున్న పరిణామాలు చూస్తే …. బద్ధశత్రువు అయిన కాంగ్రెస్ కి తెదేపా చేరువ అవటానికి … అలానే ఈ విషయాన్ని కవర్ చేసుకోవటానికి గమ్మత్తైన కారణాలు వెతుక్కుంటోంది.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ విషయంలో టీడీపీ బుద్ధి బయట పెట్టుకుంది. రేపు అనగా ఆగష్టు 9న 11 గంటలకు డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగను౦ది. ఈ రోజు మధ్యాహ్నం తో నామినేషన్ల దాఖలుకు సమయం ముగిసిపోయింది. డిప్యూటీ చైర్మన్ పదవికి ఇద్దరు పోటీ లో వున్నారు. అధికార పార్టీ అభ్యర్థిగా జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్….విపక్షాల అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపీ బీకే హరిప్రసాద్ బరిలో ఉన్నారు.

చైర్మన్ పదవి కి హరివంశ్ ని ఏకగ్రీవం చేసేందుకు అధికార పార్టీ ప్రయత్నించినా కాంగ్రెస్ తన అభ్యర్థిని పోటీ కి నిలబెట్టింది. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏకు తమ మద్దతు ఉండదని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి స్పష్టం చేశారు. విపక్షాల అభ్యర్థి బీకే హరిప్రసాద్ కు తమ మద్దతు ఇవ్వదలచినట్లు కూడా చౌదరి తెలిపారు.

కాగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ ఎంపీకి మద్దతివ్వడం ఆసక్తిదాయకం. కర్ణాటక ఎన్నికల టైం లో కలిసిన ఈ పార్టీల దోస్తానా దిన దినాభివృద్ధి చెందుతూ మరింత బలపడుతోందని తెలుస్తోంది….రాబోయే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్-టీడీపీ కలిసి పోటీ చేసినా ఆశ్చర్యం లేదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు.

ఊసరవెల్లి రంగులు మార్చిన చందంగా తెదేపా కూడా రంగులు మార్చటంలో ఆరితేరిపోయింది!!