Home రాజకీయాలు మేం వారికి వ్యతిరేకంగానే…

మేం వారికి వ్యతిరేకంగానే…

SHARE

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో అనుసరించే వైఖరిని వైసీపీ స్పష్టం చేసింది. బీజేపీ- వైసీపీ కలిసి పనిచేస్తున్నాయంటూ టీడీపీ చేస్తున్న ప్రచారానికి చెక్‌ పెట్టేంది వైసీపీ.

డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తామని ప్రకటించింది. బీజేపీ అభ్యర్థి అయినా సరే.. బీజేపీ బలపరిచే అభ్యర్థి అయినా సరే తాము వారికి వ్యతిరేకంగా ఓటేస్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు.

ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసినందుకు తాము బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తామని వెల్లడించారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదని సుప్రీం కోర్టులో కూడా కేంద్రం అఫిడవిట్ వేసిందని.. కాబట్టి ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు.

వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు విజయసాయిరెడ్డి వెల్లడించారు.