Home రాజకీయాలు దేవినేని ఉమా నీవు నిజంగా కృష్ణానీళ్లు తాగి ఉంటే…

దేవినేని ఉమా నీవు నిజంగా కృష్ణానీళ్లు తాగి ఉంటే…

177
SHARE

మంత్రి దేవినేని ఉమపై వైసీపీ సీనియర్ నేత పార్థసారథి విరుచుకుపడ్డారు. సమస్యలపై సమాధానం చెప్పాల్సిన మంత్రులు… ఆ పనిచేయడం చేతగాక ఎంతసేపు జగన్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తుంటారని మండిపడ్డారు. పదేపదే జగన్ కేసుల గురించి మాట్లాడడం మంత్రులకు అలవాటుగా మారిందన్నారు.

సోనియాగాంధీ, చంద్రబాబు కలిసి కేసులు పెట్టిన తర్వాతే తాము ఎన్నికలకు వెళ్లామని.. వాటిని ప్రజలు నమ్మలేదు కాబట్టే వైసీపీ 67 స్థానాల్లో విజయం సాధించిందన్నారు. ఇప్పటికీ పదేపదే జగన్‌ కేసుల గురించి మాట్లాడితే ప్రజలు ముఖం మీద పేడేస్తారన్న విషయం మంత్రులు గుర్తించుకోవాలన్నారు.

పోలవరం గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదంటున్న దేవినేని ఉమకు సిగ్గుశరం ఉంటే … అసలు పోలవరం ప్రాజెక్టును ప్రారంభించింది వైఎస్‌ అన్న విషయం గుర్తించుకోవాలన్నారు.

తొమ్మిదేళ్ల పాటు అధికారంలో ఉండి… రాష్ట్రం కరువుతో అల్లాడుతున్నా సరే పోలవరం ప్రాజెక్టు కట్టాలన్న ఆలోచన చంద్రబాబుకు రాలేదన్నారు.

కేసీఆర్‌ గతంలో దేవినేని ఉమా ఆడామగా అని అనుమానం వ్యక్తం చేశారని.. ఇటీవల విజయవాడ వచ్చినప్పుడు కేసీఆర్ వెంట తిరిగిన ఉమా.. ఆడామగ అంశంపై కేసీఆర్‌కు స్పష్టత ఇచ్చారా లేదా అని పార్థసారథి ప్రశ్నించారు .

నీళ్లు మళ్లించేందుకు వాడే డయాఫ్రంవాల్‌ను పూర్తి చేసి దాన్ని జాతికి అంకితమిచ్చిన వింతైన వ్యక్తి ప్రపంచంలో చంద్రబాబు మాత్రమేనన్నారు. దేవినేని ఉమా కృష్ణాజలం తాగిన వ్యక్తే అయితే ఇది వరకు చెప్పినట్టు 2018లో కాదు.. 2019లోనైనా సరే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని పార్థసారథి సవాల్ చేశారు.