Home రాజకీయాలు జలీల్‌ ఖాన్‌కు ఎర్త్ సిద్ధం.. టికెట్‌ మరో ఖాన్‌కు..

జలీల్‌ ఖాన్‌కు ఎర్త్ సిద్ధం.. టికెట్‌ మరో ఖాన్‌కు..

314
SHARE

ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌కు చంద్రబాబు హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో కూడా టికెట్‌ ఇస్తారన్న హామీతో పార్టీ ఫిరాయించిన జలీల్‌ ఖాన్‌కు ఆ అవకాశం మాత్రం దక్కే సూచనలు కనిపించడం లేదు.

ఇప్పటికే తనకు టికెట్ రాదని గ్రహించిన జలీల్‌ ఖాన్.. కనీసం తన కుమార్తెకైనా అవకాశం ఇవ్వాలని టీడీపీ పెద్దల వద్ద ప్రతిపాదన పెట్టారు. కానీ ఆ ప్రతిపాదనను కూడా చంద్రబాబు లెక్కలోకి తీసుకోలేదు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నుంచి బరిలోకి దింపేందుకు కొత్త వ్యక్తిని చంద్రబాబు సిద్దం చేసుకున్నారు.

నిమ్రా కాలేజ్‌ల అధినేత రసూల్‌ ఖాన్‌ను పార్టీలోకి తీసుకొస్తున్నారు. ఈనెల 13న ఆయన టీడీపీలో చేరబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ టికెట్ రసూల్‌ ఖాన్‌కు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్టు ప్రచారం జరుగుతోంది.

విజయవాడ పశ్చిమ టికెట్ కోసం టీడీపీలో జలీల్ ఖాన్‌ తప్ప ఎవరూ పెద్దగా పోటీ పడడం లేదు. ఈ నేపథ్యంలో జలీల్‌ ఖాన్‌ కాకుండా రసూల్‌ ఖాన్ అయితేనే బెటర్‌ అని టీడీపీ నాయకత్వం నిర్ణయించుకుంది. అయితే రసూల్‌ ఖాన్‌ స్థానికులు కాకపోవడం పెద్ద మైనస్ అయింది. ఈ ప్రాంతంలో సంబంధం లేని వ్యక్తిని విజయవాడ ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారన్న దానిపైనా టీడీపీలో చర్చ జరుగుతోంది.