Home రాజకీయాలు జన సేన ప్రజారాజ్యం వెర్షన్ 2.0 అవుతోందా?

జన సేన ప్రజారాజ్యం వెర్షన్ 2.0 అవుతోందా?

SHARE

ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన ప్ర‌జారాజ్యం వెర్షన్ 2.0 గా మారుతొందా అంటే అవుననే అంటున్నారు సామాన్యులు కూడా… చిరంజీవి కి జెండా మోసిన వారంతా ఇప్పడు జ‌గ‌సేన‌ లో కీల‌కపాత్ర పోషిస్తున్నారు. గ‌త కొన్ని రోజులుగా జనసేన లో అంత‌ర్గ‌త స‌మావేశాలు, కొత్త‌ నియామ‌కాలు , పార్టీలో కీలక వ్యక్తులుగా వ్య‌వ‌హ‌రిస్తున్న నేత‌లు ఇవి చెప్పకనే చెప్తోంది జనసేన ప్ర‌జారాజ్యం వాసన వస్తోందని.

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో క‌లిపేసాక వివిధ పార్టీల‌లో ఉన్నపీఆర్పీ నాయ‌కులు జ‌న సేన వైపు చూస్తున్నారు. ప‌లువురు నేత‌లు ఇప్పటికే జనసేన పార్టీ కండువా క‌ప్పుకొన్నారు ఇంకొందరు పార్టీలో చేర‌టానికి సిద్ద‌మౌతున్నారు. అంతేనా జనసేన పై సామాజిక (కాపు) వ‌ర్గ ముద్ర ఇప్పటికే స్ట్రాంగ్ గా పడిపోయింది.

ప్ర‌జారాజ్యం పార్టీ లో జరిగిన తప్పులు జనసేన లో జ‌ర‌గ‌వ‌ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేసినప్పటికీ …..ఆనాటి త‌ప్పులే తిరిగి పున‌రావృత‌మౌతుంద‌టంతో కొంత మంది ప‌వ‌న్ కళ్యాణ్ అభిమానులు అందోళ‌నలో చెందుతున్నారు.

చిరంజీవి ప్రజారాజ్యం మాదిరిగా జనసేన ఉండరాదనేది పార్టీలో ఎంతో మంది అంటున్న మాట. ప్రజారాజ్యం చేదు అనుభవాలు నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని సీనియర్లు చెబుతున్నారు . పవన్ ఎం జాగ్రత్తలు తీసుకుని పార్టీ ఇమేజ్ ని కాపాడుకుంటాడో చూడాలి