Home రాజకీయాలు మా పెళ్లికి రండి.. కేటీఆర్‌కు అఖిల ఆహ్వానం

మా పెళ్లికి రండి.. కేటీఆర్‌కు అఖిల ఆహ్వానం

SHARE

ఏపీ మంత్రి అఖిలప్రియ తన పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ప్రముఖులను కలిసి ఆహ్వానం పలుకుతున్నారు. ఈనెల 29న ఆళ్లగడ్డలో అఖిలప్రియ వివాహం జరగనుంది.

ఆళ్లగడ్డలోని భూమాశోభానాగిరెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజ్లో వివాహం జరగుతుంది. మంత్రి కేటీఆర్‌ను కుటుంబసభ్యులతో పాటు వెళ్లి అఖిలప్రియ కలిశారు. వివాహానికి ఆహ్వానించారు. అనంతరం గవర్నర్‌ను కూడా కలిసి పెళ్లికి రావాల్సిందిగా కోరారు.

భూమా అఖిలప్రియకు ఇది రెండో వివాహం. తొలి భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. అనంతరం పారిశ్రామికవేత్త భార్గవ్‌రామ్‌నాయుడితో ప్రేమలో పడ్డారు. భార్గవ్‌ రామ్‌నాయుడికి కూడా ఇది రెండో వివాహమే. మాజీ డీజీపీ సాంబశివరావుకు అల్లుడైన ఇతడు భార్యకు విడాకులు ఇచ్చి అఖిలప్రియను పెళ్లి చేసుకుంటున్నారు.