Home రాజకీయాలు పీడీ కుంభకోణం.. అచ్చం ఓటుకు నోటుకు వాదన…

పీడీ కుంభకోణం.. అచ్చం ఓటుకు నోటుకు వాదన…

677
SHARE

పక్క రాష్ట్రాల్లో వంద కోట్ల కుంభకోణం జరిగినా అక్కడి ప్రభుత్వాలు హడలిపోతుంటాయి. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నం. బయటకు వస్తున్నవన్నీ వేల కోట్ల రూపాయల కుంభకోణాలే. కానీ స్పందనలు మాత్రం వంద రూపాయల కుంభకోణం జరిగిందినంత ఈజీగా ఉంటున్నాయి.

తాజాగా బయటపడ్డ 53వేల కోట్ల రూపాయల పర్సనల్ అకౌంట్స్ కుంభకోణంలోనూ ఏపీలో స్పందనలు అలాగే ఉన్నాయి. రోజూ కుంభకోణాల గురించి మాట్లాడి విసుగొచ్చిందో.. లేక ఏపీలో వ్యవస్థలకు తోలు మందమెక్కిందో గానీ… 53వేల కోట్ల కుంభకోణాన్ని కూడా అదేదో సిల్లీ మ్యాటర్‌లా కేవలం మాటల యుద్ధానికి పరిమితం చేస్తున్నారు. ఈ కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వ వైఖరి మరీ విచిత్రంగా ఉంది. కనీసం మంత్రి స్థాయి వారు కూడా స్పందించలేదు.

టీడీపీ నేతో.. ప్రభుత్వ ప్రతినిధో కూడా అంతుచిక్కని కుటుంబరావు దీనిపై మాట్లాడారు. ఆయన ప్రెస్‌మీట్‌లో అచ్చం ఓటుకు నోటు సమయంలో టీడీపీ నేతలు ఎలాంటి వాదన వినిపించారో అలాంటి వాదనే వినిపించారు. అప్పట్లో టేపుల్లో ఉన్న వాయిస్‌ మీదేనా అంటే ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా చంద్రబాబు ఎదురు ప్రశ్నలు వేసినట్టు.. కుటుంబరావు కూడా కుంభకోణం జరిగిందా అంటే జరగలేదని మాత్రం సూటిగా చెప్పలేకపోతున్నారు.

58వేల అకౌంట్లు తెరిచింది మాత్రం నిజమేనంటారు. డబ్బులు వేసింది నిజమేనంటారు. కానీ ఆ డబ్బును ఏం చేశారంటే మాత్రం ప్రభుత్వం నుంచి స్పందన లేదు. 53వేల కోట్ల విలువైన కుంభకోణంపై కనీసం సీఎం నుంచి స్పందన లేకున్నా.. దాన్ని ప్రశ్నించే వారు కూడా లేకుండాపోయారంటే ఆంధ్రప్రదేశ్‌లో నిజంగానే తోలుమందమైంది.