Home రాజకీయాలు ఇప్పటికీ మొహమాటపడుతున్న బుట్టా రేణుకా

ఇప్పటికీ మొహమాటపడుతున్న బుట్టా రేణుకా

SHARE

కాసింత జ్ఞానం ఉన్నవాళ్లందరికీ తెలుసు. కంటిచూపు ఉన్న వారంతా కళ్లారా చూశారు కూడా. కర్నూలు ఎంపీ బుట్టారేణుకా వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించడం లోకమంతా చూసింది. కానీ  చట్టసభలకు, లోక్‌సభ స్పీకర్‌ దృష్టిలో మాత్రం ఇప్పటికీ తనకు టీడీపీకి ఏమీ సంబంధం లేదన్నట్టు బుట్టా రేణుకా వ్యవహరిస్తున్నారు.

టీడీపీ ఆదేశాలను పాటిస్తారు… టీడీపీ ఎంపీలతో కలిసే పార్లమెంట్‌లో తిరుగుతున్నారు. వారిలో పాటే ఆందోళన కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. కానీ ఇప్పటికీ చట్టానికి సాంకేతికంగా దొరక్కుండా జాగ్రత్తపడుతూ పార్లమెంట్ సాక్షిగా భారత రాజకీయ వ్యవస్థకు బుట్టా రేణుకా సవాల్ విసురుతున్నారు.

తాజా పార్లమెంట్ సమావేశాల్లోనూ బుట్టా రేణుకా టీడీపీ ఎంపీలతో కలిసే తిరుగుతున్నారు. వారితో పాటే ఆందోళనల్లో పాల్గొంటున్నారు. కానీ టీడీపీ ఎంపీలంతా పచ్చకండువాలేసుకుని.. పచ్చ ప్లకార్డులు పట్టుకుంటున్నారు.

బుట్టా రేణుకా మాత్రం ఆ ఒక్క విషయంలో జాగ్రత్తపడుతూ పార్లమెంట్ వద్దే పార్లమెంట్‌ చెవిలో పూలు పెడుతున్నారు. టీడీపీ ఎంపీలంతా పచ్చ రంగు ప్లకార్డులు, కండువాలతో ఉంటే.. బుట్టా రేణుకా మాత్రం తెల్లరంగు ప్లకార్డు పట్టుకుని.. వారి పక్కనే నిలబడుతున్నారు.

పట్టపగలు పార్టీ ఫిరాయించిన బుట్టా రేణుకాకు ఇక పచ్చకండువా వేసుకునేందుకు ఏ మొహమాటం అడ్డువస్తోందో!. అయినా ఏడాది ఏమీ చేయలేని వ్యవస్థలు ఇప్పుడు పచ్చకండువా వేసుకుని తిరిగినా ఏం చేస్తాయి బుట్టా రేణుకా అమాయకత్వం కాకపోతే!.