Home రాజకీయాలు బుడబుక్కలోడు…..జీవీఎల్ పై కుటుంబరావు ఫైర్!

బుడబుక్కలోడు…..జీవీఎల్ పై కుటుంబరావు ఫైర్!

SHARE

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పీడీ అకౌంట్స్ లో భారీ అవినీతి జరిగిందంటూ బీజేపీ నేత రాజ్య సభ సభ్యుడు
జీవీఎల్ నరసింహారావు చేసిన ఆరోపణలు రాష్ట్రంలో కేంద్రం లో పెద్ద దుమారమే లేపుతున్నాయ్. అయితే…ఆయన ఆరోపణలు కేవలం టీ కప్పులో తుఫాను అంటూ తెదేపా పెదవి విరిచింది.

ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు జివీఎల్ పై విరుచుకుపడ్డారు. ఓ ప్రముఖ తెలుగు టీవీ మీడియా లో నిర్వహించిన చర్చాకార్యక్రమంలో పాల్గొన్న జీవీఎల్ మాట్లాడుతూ, జీవీఎల్ చెప్పిన 6 కార్పొరేషన్లలో నిధులు దారిమళ్లాయని రుజువైతే తాను స్వచ్ఛందంగా అరెస్టవుతానని, కానీ అదే ఆరోపణలు రుజువు కాని పక్షంలో జీవీఎల్ అరెస్టకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లో కానక రూపాయి దారిమళ్లినట్టయితే తనపై తానె దర్యాప్తు వేసుకుంటానని కుటుంబరావు అన్నారు. ప్రతి బుడబుక్కలోడు ఎంక్వైరీలు అంటుంటే పరిపాలన చేయాలా…ఎలా చూస్తూ కూర్చోవాలి అని ఆయన ప్రశ్నించారు.

జివీఎల్ ని ఇరవై నాలుగు గంటల్లో లేఖ పంపమనండి తాను వివరణ ఇస్తానని తమ సమాచారమంతా తొంభై శాతం ఆన్ లైన్ లోనే ఉంటుందని కూడా తెలిపారు. ఇంకా కాగ్ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వంపై ఏ ఒక్క కామెంటూ చేయకుండానే ఉందా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.