Home రాజకీయాలు కౌలు రైతులక్కూడా వడ్డీ లేని రుణ సౌకర్యం: జగన్

కౌలు రైతులక్కూడా వడ్డీ లేని రుణ సౌకర్యం: జగన్

163
SHARE

కౌలు రైతులకు జగన్ అభయం ఇచ్చారు. బహుశా ఇంతవరకూ ఏ ప్రభుత్వమూ కౌలు రైతుల కష్టాలకి స్పందించలేదనుకుంటా. మొన్నీమధ్యే ఢిల్లీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రైతుల కష్టాలకు కొంత మేరకు తీర్చేలా రైతులు వారి భూమి లో కొంత లీజు కి ఇస్తే సోలార్ ఫార్మ్ లు పెట్టి సంవత్సరానికి లక్ష రూపాయలు అద్దె వచ్చేలా ఓ స్కీం ని ప్రవేశపెట్టింది. అది ఖచ్చితంగా రైతులకు ఊరట అని చెప్పొచ్చు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో రైతుల కష్టాలు వర్ణనాతీతం. అందుకేగా రుణ మాఫీ అంటూ పార్టీలు పాటందుకున్నది. బాబు రైతులకి ఎం చేశారనేది పక్కన పెడితే…పాదయాత్ర లో వున్న విపక్ష నేత వైఎస్ జగన్ మాత్రం తమ పార్టీ అదికారంలోకి వస్తే కౌలు రైతులకు మేలు చేసే చట్టం తెస్తామని చెప్పారు.

కత్తిపూడిలో జరిగిన సభలో ఈరొజూ జగన్ మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆరుగురు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వారి కుటుంబాల వారు చెప్పారని వెల్లడించారు. వారి బాధలు విన్న తర్వాత తానొక నిశ్చయాని కొచ్చినట్టు చెప్పారు. తమ ప్రభుత్వం అదికారంలోకి రాగానే రైతులకు నష్టం జరగకుండా, కౌలు దారులకు మేలు జరిగేలా చట్టం తెస్తామని అన్నారు. రైతులతో సమానంగా కౌలురైతులకు కూడా బ్యాంకులలో వడ్డీ లేని రుణాలు ఇప్పించే విదంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.