Home రాజకీయాలు వైసీపీలో చేరిన నటుడు కృష్ణుడు

వైసీపీలో చేరిన నటుడు కృష్ణుడు

765
SHARE

వినాయకుడుతో పాటు అనేక హిట్‌ సినిమాల్లో నటించిన ప్రముఖ నటుడు కృష్ణుడు రాజకీయ రంగప్రవేశం చేశారు. ఆయన వైసీపీలో చేరారు. జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్‌ను కృష్ణుడు కత్తిపూడిలో కలిశారు. పలువురు పార్టీ నేతల సమక్షంలో వైసీపీలో చేరారు. వైఎస్ జగన్‌ నుంచి స్పూర్తి పొందే తాను వైసీపీలో చేరినట్టు కృష్ణుడు తెలిపారు. జగన్‌ పాదయాత్రలో స్పూర్తి నింపిందన్నారు.

జగన్‌కు మద్దతుగా నిలిచేందుకే తాను పార్టీలో చేరినట్టు వివరించారు. వైసీపీ గెలుపుకు తన వంతు కృషి చేస్తానని కృష్ణుడు వివరించారు. చిత్రపరిశ్రమ నుంచి కూడా వైసీపీకి ఇటీవల గట్టి మద్దతే లభిస్తోంది.

టీడీపీ ఆధిపత్యం ఉండే చిత్రపరిశ్రమలో కొందరు ధైర్యంగా ముందుకొచ్చి వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే పోసాని కృష్ణమురళీ, పృథ్వీ, చోటా కే నాయుడు తదితరులు వైసీపీకి మద్దతు తెలిపారు.