Home రాజకీయాలు ఎల్లో మీడియా పై తీవ్ర విమర్శలు చేసిన వై ఎస్ జగన్

ఎల్లో మీడియా పై తీవ్ర విమర్శలు చేసిన వై ఎస్ జగన్

86
SHARE

విపక్ష నేత వైకాపా అధ్యక్షుడు వై ఎస్ జగన్ ఎల్లో మీడియా ను ఏకిపారేశారు. రాష్ట్రం లో ఇన్ని సమస్యలు ఉన్న వాటిపై ఫోకస్ పెట్టకుండా సమస్యలను ఏకంగా పక్కదారి పట్టించేలా పచ్చ మీడియా కృషి చేస్తోందని ఆయన ఆరోపించారు.

అసలు ఈనాడు మొదటి పేజీలో ఎక్కడా కూడా సమస్యల గురించి రాయకుండా, చంద్రబాబు పోస్టర్ లా బాబు కి సంబంధించిన ప్రకటనలకు ప్రాదాన్యం ఇస్తూ బాబు కి బాకా ఊదుతున్నాయని అన్నారు.

బాబు అబద్దాలు మోసం …అన్యాయం ఇలా ఏవి కూడా ఎల్లో మీడియా లో చూపించడం లేదని అసలు యెల్లో మీడియా కు ఇవేవి కనిపించవని జగన్ పేర్కొన్నారు.

అంతకన్నా ఘోరం ఏంటయ్యా అంటే చంద్రబాబు ఇంద్రుడు,చంద్రుడు, రైతులు కేరింతలు కొడుతున్నారు, మొత్తం భారతదేశం చూపంతా కూడా ఏ పీ వైపే అన్నట్టుగా ఎల్లో మీడియా రాస్తోందని ఆయన మండిపడ్డారు.

రాష్ట్రంలో ఓ పక్క కరువు తో అల్లాడుతున్నా మంత్రివర్గ సమావేశంలో అది చర్చకు కూడా రావడం లేదని జగన్ అన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేని పరిస్థితి ఉంటే కూడా ఎల్లో మీడియాకు కనపడదని అన్నారు.