Home రాజకీయాలు బంగారు తెలంగాణ కాదు, చిన్నారులను ప్రేమించే సమాజం!

బంగారు తెలంగాణ కాదు, చిన్నారులను ప్రేమించే సమాజం!

SHARE
పోలీస్  లకు కూడా షాక్ కలిగేలా యాదాద్రి వ్యభిచార స్కాండల్ వుంది. 15మంది చిన్నారులను మురికి కూపాల్లో నుండి రక్షించిన వారం రోజుల తరువాత ఎవరూ నమ్మలేని నిజాలు తెలుస్తున్నాయి. మనుషుల అక్రమ రవాణా గ్యాంగ్ తో యాదాద్రి లో వ్యభిచారం చేసే గ్యాంగ్ లు కుమ్మక్కయ్యాయి. ఈ గంగలు కొంత మంది పోలీసులతో డాక్టర్లతో కలిసి ఓ నెట్వర్క్ లా ఆపరేట్ చేస్తూ ఎంతో మంది చిన్నారుల జీవితాలను నరకప్రాయం చేస్తున్నారు.
ఆడపిల్లల్ని కిడ్నప్ చేసి తీసుకురావటం…ఏడూ, ఎనిమిది ఏళ్ళ వయసు రాగానే వారికి హార్మోన్ ల ఇంజెక్షన్ లు ఇచ్చి…శారీరకంగా వారు సెక్స్ కి రెడీ అయ్యేలా చేయటం ఇక వారి బ్రతుకు బండలు చెయ్యటం. ఒకవేళ ఎవరైనా కాదని ఎదురు తిరిగి ప్రశ్నిస్తే, ఒళ్లంతా వాతలు, పస్తులూ ఒకటేమిటి చిగుళ్ల వరకూ గోళ్లను కత్తిరించి హింసలు. ఇదంతా పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రమైన యాదగిరి నరసింహస్వామి సాక్ష్యం గా విరాజిల్లుతున్న వైనం. జరుగుతున్న వ్యభిచార దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపిన తరువాత వెలుగుచూసిన పచ్చి నిజాలు. తాము కిడ్నాప్ చేసి తెచ్చిన బాలికలను మధ్యవర్తులు వ్యభిచార గృహాలకు తెచ్చిన తరువాత వారు పడే బాధలు వర్ణనాతీతం అని పోలీసులు వెల్లడించారు.
ఐదేళ్ల వయసులో బట్టలు ఉతకటం, ఇంటి పనూలు చేయటం  రాత్రయితే వ్యభిచారం చేస్తుంటే, వారి ముందు కూర్చుని జరుగుతున్న చండాలాన్ని చూస్తూ ఉండటం …ఈ చేదు నిజాన్ని ఓ బాలిక కళ్లకు కట్టినట్టు వివరిస్తుంటే పోలీస్ అధికారులే దిగ్భ్రాంతి చెందామని వ్యాఖ్యానించారు. తనకు నిద్రవచ్చి కళ్లు మూసుకుపోతే ఎర్రగా కాలిన ఇనుపచువ్వతో వాతలు పెట్టారని… ఏడేళ్ల బాలిక చెప్పిన తీరు మీడియాకు వెల్లడిస్తూ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులు కన్నీరు పెట్టుకున్నారు. మళ్లీ కాలుస్తారేమోనన్న భయంతో తాను అక్కడ జరుగుతున్నది రోజూ చూశానని ఆ పాప చెప్పటం అందరిని కంట తడిపెట్టించే విషయం.
ఇక ఆడ పిల్లలకు ఏడు, ఎనిమిది ఏళ్ల వయసు రాగానే వ్యభిచారంలో శిక్షణ ఇవ్వడం ప్రారంభిస్తాయట ఈ వ్యభిచార కూపాలు. రాత్రుళ్లు మెలకువగా ఉండేలా చేయడం, హార్మోన్ ఇంజక్షన్లు, వ్యభిచారం తప్పు కాదన్నట్టు అడల్ట్ సినిమాలకు చిన్న పిల్లల్ని ఎక్సపోజ్ చేయటం, ప్రత్యక్షంగా వ్యభిచారం ఎలా చేస్తారో చూడమని గదుల్లో కూర్చోబెట్టడం లాంటి పనులు చాలా కామన్. చేయని తప్పుకు చిన్నారులు అనుభవించిన నరకం కరుడుకట్టిన హృదయాలను సైతం కన్నీరు వచ్చేలా చేస్తుంది.
15 మంది బాలికలను పోలీసులు రక్షించిన తరువాత, దాదాపుగా 110 కుటుంబాలు చిన్నారులను తీసుకుని పారిపోయాయని పోలీసులు భావిస్తున్నారు. దాడులు మొదలవగానే వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నగ్యాంగ్లకి వాట్స్ యాప్ గ్రూపులోకి రిపోర్ట్ వెళ్లిపోగా ఇళ్లకు తాళాలేసి పారిపోయినట్టు తెలుస్తోంది. గుట్టలోని పాత నరసింహ స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో ఎన్నో ఇళ్లు తాళాలు వేసి కనిపిస్తుండగా, వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.
కొన్ని ఏళ్లుగా ఇక్కడ ఈ దందా జరుగుతుండగా దీన్ని ఇంతవరకు ఎవరూ పూర్తిగా ఆప లేకపోవడం శోచనీయం. బంగారు తెలంగాణ లాంటి పెద్ద పెద్ద కళలు తరవాత…మన చిన్నారులకి కాపాడుకోలేని సమాజం దేశానికే కళంకం!!