Home రాజకీయాలు “అంతా ఏకమై బాబు అనే చీడ పురుగుని మట్టి కురిపించాలి”

“అంతా ఏకమై బాబు అనే చీడ పురుగుని మట్టి కురిపించాలి”

46
SHARE

టీ టీడీపీ నేత బహిష్కృత నేత ..సీనియర్ రాజకీయ వేత్త మోత్కుపల్లి నరసింహులు ఎప్పుడైతే తెదేపా నించి బయటికొచ్చారో అప్పటినుంచి బాబు ని ఓ రకంగా ఆడుకుంటున్నారు. బాబు ని ఓడించేదాకా తనకి సంతోషం లేదని అన్న ఆయన…తిరుమల కొండా పైకి మెట్లపై వెళ్లి ఏడుకొండల స్వామి కి బాబు విషయమై మొక్కుకున్నారు కూడా..!
ఇక తాజాగా అన్ని రాజకీయ పార్టీల కు చెందిన నేతలంతా ఏకమై, చంద్రబాబు అనే చీడ పురుగును ఏరి పారేయాలని మోత్కుపల్లి అన్నారు. తాను 35 సంవత్సరాల పాటు పార్టీ కోసం పని చేస్తే అత్యంత అవమానకరంగా, గొంతు పిసికి రోడ్డు మీదకి విసిరేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ఏ తప్పూ చేయని తనని ఇంత క్షోభ పెట్టిన చంద్రబాబు అందుకు తగిన మూల్యం చెల్లిస్తారని చెప్పారు.

బాబును ఓడించేందుకు ఏపీకి సంబంధించి జగన్, పవన్, కిరణ్ కుమార్ రెడ్డిలను కూడా కలుస్తానని అన్నారు.

అయితే తన రాజకీయ అడుగులపై స్పందిస్తూ ఏ పార్టీలో చేరాలన్న విషయ౦ పై తాను ఇంతవరకు నిర్ణయించు కోలేదని మోత్కుపల్లి అన్నారు. అయితే తన గౌరవాన్ని కాపాడే పార్టీ లో మాత్రమే చేరుతానని అన్నారు. లేకాపోతే తనను ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ఆలేరు నుంచి ఇండిపెండెంట్ గా పోటీ కి దిగుతానని చెప్పారు. ఒకరి మోచేతి నీళ్లు తాగి బతకాల్సిన అగత్యం తనకి లేదని …తాను ఎన్టీఆర్ కి శిష్యుడనని గుర్తుచేశారు.