Home రాజకీయాలు ఏపీ ప్రభుత్వం పై జివీఎల్ బాంబ్

ఏపీ ప్రభుత్వం పై జివీఎల్ బాంబ్

51
SHARE

రాజ్యసభ సభ్యుడు భాజపా నేత జివిఎల్ నరసింహరావు ఓ విషయం చెప్పి సంచలన౦ సృష్టించారు. ఎపి ప్రభుత్వం లక్ష కోట్ల అవినీతి కి పాల్పడిందని ఆయన ఆరోపించారు. పైగా అందులో ఏభై మూడు వేలకోట్ల రూపాయలను అదికారుల వ్యక్తిగత ఖాతాలలోకి వేసింద౦టూ జీవీఎల్ ఆరోపించారు.

ఆంధ్ర ప్రదేశ్ లో 58,418 పర్సనల్ అకౌంట్లను అదికారుల పేరు తో ఎలా ఎందుకు తెరిచారని ఆయన ప్రశ్నించారు. టీడీపీ పర్సనల్ అకౌంట్ల స్కాం ను జాతీయస్థాయిలో బట్ట బయలు చేస్తామని నరసింహారావు తెలిపారు.

ఎపి లో దుర్మార్గపు పాలన సాగుతోందని, ఎన్నికల లో రాజకీయ లబ్ది కోసం తాపత్రయ పడుతున్న తెలుగుదేశం పార్టీ దుష్ట రాజకీయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. టిడిపి పాలన ఎంత అరాచకమో కాగ్ నివేదిక చెప్పకనే చెప్పిందని జివిఎల్ అన్నారు.

ఈ బెదిరింపులెందుకు సార్….మీరంటున్న స్కాం నిజమే అయితే ఎందుకు గోప్యం గా ఉంచుతున్నారు?