Home రాజకీయాలు బాబు ప్రజలపై అలిగారు..

బాబు ప్రజలపై అలిగారు..

42
SHARE

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలపై అలిగారు. ముఖ్యమంత్రి పేరుతో ప్రతి రోజూ వచ్చే పోన్ లకు జనం స్పందించాల౦ట. అది జరగటం లేదని పాపం అలిగారు.

జన౦ కోసమే తాను కేంద్రం సహకరించిన సహకరించక పోయినా…రేయి పగలూ తేడా లేకుండా రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా….ఇంత కష్టపడుతున్నానని అన్నారు. అలాంటిది ఆయన ఫోన్ కాల్ కి స్పందన లేకపోతే బాబు కు కోపం వస్తోందట. కేవలం ప్రజలకి ఇంకా ఏమైనా సమస్యలుంటే పరిష్కరి౦చటానికి… ప్రభుత్వ పథకాల అమలు విషయంలో ఏమైనా లోతుపాతులు ఉంటే తెలుసుకుందామని ఫోను చేస్తుంటే కనీసం స్పందన కూడా లేదని బాబు వాపోయారట.

కేవలం 30 శాతం ప్రజలు మాత్రమే బాబు ఫోన్ కి స్పందించి బదులిస్తున్నారు…అయినా అందరి దగ్గరా సెల్‌ఫోను ఉన్నా వినియోగించడంలో మాత్రం అస్సలు శ్రద్ధ చూపట్లేదని, బాబు అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సరైన దారి లో వెళ్తేనే ప్రగతి సాధ్యమని పేర్కొన్నారు.

అసలు ఈ పోన్కాల్స్ టిడిపి ప్రచార కాల్స్ లా ఉండటం వల్లే జనాలకి విసుగెత్తి స్పందించడం మానేశారు…ఆ విషయం కొంచం సీఎం గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్!