Home రాజకీయాలు ఉక్కు ఉద్యమాన్ని బాబు ఉక్కుపాదం తో తొక్కడం పై జగన్ ధ్వజం!

ఉక్కు ఉద్యమాన్ని బాబు ఉక్కుపాదం తో తొక్కడం పై జగన్ ధ్వజం!

65
SHARE

డప ఉక్కు పరిశ్రమ సాధనకోసం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నాయకులపై ఈ రోజు అతి దారుణంగా పోలీసులు లాఠీ చార్జీ చేశారు. పోలీస్ దెబ్బల ధాటికి యోగివేమన యూనివర్సిటీ ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి రమేష్‌ నాయక్‌ సొమ్మసిల్లి పడిపోయాడు.

అతని పరిస్థితి విషమించడం తో జిల్లా సిపిఎం కార్యదర్శి కె. ఆంజనేయులు రమేష్‌ నాయక్‌ తో పాటు రోడ్డుపై బైటాయించి నిరసన తెలపబోతుంటే పోలీసులు బలవంతంగా రిమ్స్‌కు తరలించారు. బాధితుడి కొంత ఆందోళనకరంగా మారటంతో అతడిని తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. ఈ విద్యార్థి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రావాలంటే మరో 40గంటలు వేచి చూడాలని స్విమ్స్ వైద్యులు చెప్పారు.

దీనిపై జగన్ స్పందించారు ఉక్కు ఫ్యాక్టరీ కావాలన్నందుకు ఉక్కుపాదం మోపుతారా అని ధ్వజమెత్తారు. జగన్ ట్విట్టర్ పై బాబు పై దాడి చేశారు…..లంచాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు పక్కదారి పట్టించారని అన్నారు. గతంలో విద్యుత్తూ చార్జీల పెప్మ్పుని నిరసిస్తున్న ప్రజలపై ఎలా పోలీస్ జులుం చూపించారో…ఈనాడు అదే రీతిన విద్యార్థులపై ఉక్కుపాదం మోపుతున్నారని అన్నారు. ప్రజలకు తన మోసాల గురించి మాట్లాడలేని పరిస్థితుల్లో ఇలా జులుం ప్రదర్శిస్తారా అన్నారు.