Home రాజకీయాలు బాబు ని కడిగి పారేసిన భూమన..!!

బాబు ని కడిగి పారేసిన భూమన..!!

SHARE

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం లో జరిగిన బహిరంగ సభ గురించి వైకాపా నేత భూమన కరుణాకర రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సభ లో రెండుగంటల పాటు ఏకధాటిగా ప్రసంగించి ప్రజలను విసుగెత్తించి పారేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు.

అయితే విపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు చేయడానికి, జగన్ ని అనరాని మాటలు అనడానికి కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసి బహిరంగ సభలు పెడుతున్నారని భూమన అన్నారు.

ఇంతకుమునుపు వైఎస్ రాజశేఖరెడ్డి ని ఇలానే తీవ్రంగా దూషించేవారని అన్నారు. అప్పట్లో వైఎస్ఆర్ అన్నా కూడా చంద్రబాబు వణికి చచ్చేవాడని, అలాగే ఇప్పుడు జగన్ ను చూసి అలాగే భయపడి వ్యక్తిగత దూఫణలు బూతు పంచాంగంతో కాలం గడుపు తున్నారని భూమన వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ఒక ముఖ్యమంత్రి లా మాట్లాడటంలేదని ఆయన అన్నారు. డ్రైనేజీ కంపు లా మాట్లాడారని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం చేసిన పనులేవి లేక చెప్పుకోలేక జగన్ ని మాటలు అనడమే పనిగా పెట్టుకున్నారు తెదేపా వారని ఆయన అన్నారు.