Home రాజకీయాలు పవన్ కి ఎన్నికల టైముకన్నాకాపు రిజర్వేషన్ పై క్లారిటీ వస్తుందా?

పవన్ కి ఎన్నికల టైముకన్నాకాపు రిజర్వేషన్ పై క్లారిటీ వస్తుందా?

233
SHARE

కాపు రిజర్వేషన్ కి సంబంధించి జన సేన అధినేత సందిగ్ధంలో ఉన్నట్టున్నారు. ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో అధ్య‌య‌నం అంటూ మళ్ళీ ఓ క‌మిటీ వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే ఇది కేవలం కాల‌యాప‌న చేయటానికే అనే విషయం అర్ధం అవుతూనే వుంది. స‌మ‌స్య‌ పరిష్కారానికి తన వంతూ ఏమీ చేయలేక తన వైఖ‌రి కూడా ప్ర‌క‌టించ‌కుండా కాలం గడపడాని మాత్రమే ఈ కమిటీ నిర్ణయమని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

అయితే ఇక్కడ వాస్త‌వానికి కాపులకు రిజ‌ర్వేష‌న్ల అంశం ఇప్పటిది కాదు. అది జన సేన అధినేతకి కూడా తెలుసు. అందుకే అప్పుడప్పుడు దాని గురించి ఆయన మాట్లాడటం జరిగింది. కానీ ఎన్నో అర్ధం కానీ ప్రకటనలు చేశారు. అసలు కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో తనకున్న క్లారిటీ ఎవ్వడికి తెలీకుండా దాచగలిగారు. అయితే ఏపీ ప్రభుత్వం 5% రిజ‌ర్వేష‌న్ల ప్రకటన చేయగానే 5% ఎలా స‌రిపోతాయంటూ ప్రభుత్వాన్ని అడిగారు…ఇంకా అసలు ఇవ్వ‌కుండా ఉంటే బాగుండేది ఏమో అంటూ కూడా అన్నారు. బిరియానీ అంటూ ఆశ చూపించి ఆవ‌కాయ‌తో సరి పెడతారా అని చంద్ర‌బాబుని నిల‌దీశారు.

ఇప్పుడు వైకాపా అధ్యక్షుడు జ‌గ‌న్ క్లారిటీగా ప్రకటన చేసిన నేప‌థ్యంలో జ‌న‌సేన అధినేత పై అంద‌రి దృష్టి ప‌డింది. ఇక ఈ నెల‌లోనే మ్యానిఫెస్టో కూడా ప్ర‌క‌టించ‌బోతున్న టైం లో కాపుల అంశంపై ప్ర‌క‌ట‌న ఖచ్చితంగా పవన్ చేయాల్సిన సందర్భం.

కాపుల‌కు మ‌ద్ధ‌తు ఉంటే కాపు పార్టీ అనే ముద్ర బ‌ల‌ప‌డుతుంది…అలా కాదని వారికి మ‌ద్ధ‌తు ఇవ్వ‌క‌పోతే అసలుకే మోసం వస్తుంది అందుకే కాపు రిజ‌ర్వేష‌న్ల విష‌యాన్ని కమిటీ పేరుతో తెలివిగా వాయిదా వేశారు పవన్. పోనీలే ఎన్నిక‌ల సమయానికైనా ప‌వ‌న్ కళ్యాణ్ కి కాపులకి రేజర్వేషన్ల విష‌యంలో ఓ క్లారిటీ వస్తే సంతోషమే.