Home రాజకీయాలు బాబు సభకి రావాలి…లేదా 400 రూపాయలు కట్ !!

బాబు సభకి రావాలి…లేదా 400 రూపాయలు కట్ !!

SHARE

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలతో గొప్ప చిక్కొచ్చి పడింది. కట్ ఔట్లు ఆడిపోతున్నాయి…అర్రంగెమెంత్స్ అద్దిరిపోతున్నాయి కానీ జనాలే…బాబు ప్రసంగాలు వినటానికి ప్రజలను సమీకరించడమే పెద్ద సమస్యయింది తెదేపా నేతలకు.

మొన్నీమధ్య బాబు సభలో ఖాళి కుర్చీలు ప్రాగణం అంత వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసి ట్రోల్ చేయటం తో….హై కమాండ్ నించి వార్నింగ్ వచ్చింది తెదేపా నేతలకి…ఛచ్చి చెడి బ్రతిమిలాడుతున్న ఎవ్వడూ రాము పొమ్మంటున్నారు.

ఇక లాభం లేదనుకొని అనంతపురం జిల్లాలో జరగబోయే సభకు డ్వాక్రా మహిళలను సభ కు రమ్మనే ఆలోచనలో పడ్డారు నేతలు …ఈ క్రమంలో ఓ నేత డ్వాక్రా మహిళకు పోన్ చేసి సభకు హాజరు కావాలని కోరారు. అయితే ఆ డ్వాక్రా మహిళ తాను రాను అని, వచ్చే వాళ్లను తీసుకు వెళ్లావచ్చని చెప్పింది. దాంతో కోపం వచ్చిన ఆ నేత సభకు రానట్టయితే 400 రూపాయలు కట్ చేస్తానని హెచ్చరించింది. ఆ ఆడియో తప్పు ఇప్పుడు కలకలం రేపుతోంది.

ముఖ్యమంత్రి సభకు డబ్బు ఇచ్చి జనాన్ని సమీకరించడం జరుగుతున్నదే అది ఒక ఎత్తు అయితే, కానీ రాకపోతే డబ్బు కట్ చేస్తామని బెదిరించడం కొత్త విషయం మరి!!