Home రాజకీయాలు పవన్ పై లోకేష్…!!

పవన్ పై లోకేష్…!!

219
SHARE

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ పై ఎపి ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ విరుచుకుపడ్డారు. పవన్ ఆరోపణలపై సమాధానం చెప్పకుండా, తనపై పవన్ ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో తెలియదని ఆయన అన్నారు.

పవన్ తనకు శేఖర్ రెడ్డి నోట్ల కుంబకోణంతో సంబందం ఉంద౦టూ ఆరోపించారని అయితే ఇపాటిదాకా ఒక్క ఆధారం కూడా పవన్ చూపలేకపోయారని లోకేష్ అన్నారు. చేసిన ఆరోపణలలో ఒక్కటి కూడా పవన్ కళ్యాణ్ నిరూపించలేకపోయారని లోకేష్ అన్నారు. ఇతరులు పవన్ పై ఆరోపణలు చేస్తే పవన్ ఎంత బాధ పడతారో తానూ అంతే బాధపడతానని లోకేష్ అన్నారు.

నిరాధారమైన ఆరోపణలు చేస్తే రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు కూడా రాకుండా వెనక్కిపోయే అవకాశమే ఎక్కువ ఉందని లోకేష్ అబిప్రాయపడ్డారు. ఆరోపణలు చేస్తే పెట్టుబడుల సాకు చెప్పి బ్లాక్మెయిల్ చెయ్యటం చంద్రబాబు దగ్గరనుంచి లోకేష్ బాగానే నేర్చుకున్నట్టున్నారు.