Home సినిమా బ౦డ బూతుల వీడియో డిలీట్ చేసిన శ్రీ రెడ్డి

బ౦డ బూతుల వీడియో డిలీట్ చేసిన శ్రీ రెడ్డి

SHARE

శ్రీ రెడ్డి గురించి తెలియని తెలుగు వారుంటారా? ఆ పేరు తెలియని సినీ అభిమాని ఉండరనే చెప్పాలి. నటిగా వచ్చిన గుర్తింపు సూన్యమే అయినా వివాదాలతో బానే గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంటూ స్టార్ట్ పెట్టిన శ్రీ రెడ్డి తర్వాత కొంతమండి ప్రముఖుల పర్సనల్ లైఫ్ లోకి కూడా వెళ్ళిపోయింది.

తెలుగు ఇండస్ట్రీ భరించలేనంత రచ్చ చేసి కోలీవుడ్ లో కూడా అడుగు పెట్టింది. తనకు అవకాశాలు ఇప్పిస్తానని మోసం చేసారంటూ ఎంతో మంది ఫై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. దర్శకుడు రాఘవ లారెన్స్ ఫై కూడా ఆరోపణలు చేయడం తో ఆయన సోషల్ మీడియా ద్వారా శ్రీ రెడ్డి కి సవాల్ విసిరాడు.

దాని పై శ్రీ రెడ్డి బూతులతో ఫైర్ అయ్యింది. పేస్ బుక్ లైవ్ లో రాఘవ ఫై బూతుల దండకమే ఎత్తుకుంది లారెన్స్ ని అనరాని మాటలు అంది. లారెన్స్ భార్యప్రస్తావన తెచ్చింది. అయితే మరీ సెన్సార్ కి మించి బూతుల ప్రయోగం చేయడం తో సోషల్ మీడియా లో శ్రీ రెడ్డి పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

బహుశా హెచ్చరికలు కూడా అందినట్లున్నాయి, కాసేపటికే ఆ బూతుల వీడియోను డెలీట్ చేసింది. ఏమిటో శ్రీ రెడ్డి …ఎవ్వరికి నిద్ర ఇవ్వకుండా…ఒత్తి ఆరోపణలతో…ఇంకా ఎంత కాలం సాక్షాల కోసం వెయిట్ చెయ్యాలమ్మా?