Home రాజకీయాలు జగన్ కి పిఠాపురం కాపు యువత థాంక్స్

జగన్ కి పిఠాపురం కాపు యువత థాంక్స్

SHARE

విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ కు కాపు యువత పిఠాపురం కి స్వాగతం పలికిన తీరు చర్చనీయాంశం అయింది. పిఠాపురం లో జరిగిన భారీ బహిరంగ సభలో కొందరు యువత ప్లకార్డు లు పట్టుకుని జగన్ కు ధన్యవాదాలు తెలిపారు.

కాపుల అబివృద్దికి పదివేల కోట్ల రూపాయలు ఇస్తామని జగన్ ప్రకటించడంపై వారు ఆయన కు దన్యవాదాలు చెబుతున్నట్టు ప్లకార్డు లలో రాశారు. ఈ ప్లకార్డులు కాపు యువత పేరుతో ఉండటం విశేషం.
జగ్గంపేటలో కొందరు కాపుల రిజర్వేషన్ లపై జగన్ వైఖరి అడిగారు.

విపక్ష నేత స్పందిస్తూ కాపులకు రిజర్వేషన్ లు తన పరిధి కాదని తాను చేయలేని హామీ ఇవ్వనని అన్నారు. రిజర్వేషన్లు 50% కి మించితే అవి కేంద్రం పరిదిలో వెళ్తాయని అన్నారు. అయితే తనకి సంబంధించి కాపు కార్పొరేషన్ కి తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తున్న నిదులకు రెట్టింపు తాము ఇస్తామని ప్రకటించారు. దానికి ఈ యువత సంతోషం వ్యక్తం చేశారు.