Home రాజకీయాలు కాపుల‌ను మోసం చేసిందెవ‌రు..?

కాపుల‌ను మోసం చేసిందెవ‌రు..?

247
SHARE

కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించ‌ట‌మ‌న్న‌ది కేంద్ర‌ప్ర‌భుత్వ ప‌రిధిలోని అంశ‌మంటూ జ‌గ్గంపేట నియోజ‌క‌వ‌ర్గంలో జ‌గ‌న్ మాట్లాడుతూ చెప్పారు. ఆ ప్ర‌క‌ట‌న‌పై ముద్ర‌గ‌డ మాట్లాడుతూ కాపులంటే జ‌గ‌న్ కు చిన్న చూప‌ని ఆరోపించారు. రిజ‌ర్వేష‌న్ అంశంపై త‌న అభిప్రాయాన్ని జ‌గ‌న్ చెబితే అది చిన్న చూపెలాగ అవుతుందో మాత్రం ముద్ర‌గ‌డ చెప్ప‌లేదు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కాపు జాతికి రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తాడేమోన్న ఉద్దేశ్యంతోనే జ‌గ‌న్ అడ్డుప‌డుతున్నారంటూ ముద్ర‌గ‌డ మండిప‌డ్డారు. అధికారంలోకి రావ‌ట‌మే ల‌క్ష్యంతో ఆచ‌ర‌ణ సాధ్యం కాద‌ని తెలిసినా చంద్ర‌బాబు కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌టం హామీల్లో ఒక‌టి. మొన్న‌టి వ‌ర‌కూ ఇదే ముద్ర‌గ‌డ కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇస్తాన‌ని హామీ ఇచ్చి చంద్ర‌బాబు ద‌గా చేశాడ‌ని విమ‌ర్శించిన సంగ‌తి అంద‌రూ చూసిందే. నిజానికి రిజ‌ర్వేష‌న్ క‌ల్పించ‌టం రాష్ట్ర‌ప్ర‌భుత్వ ప‌రిధిలోని అంశ‌మ‌ని అంద‌రికీ తెలుసు. ఒక కులానికి రిజ‌ర్వేష‌న్ ఇవ్వాల‌న్నా తీసేయాల‌న్నా కేంద్ర‌ప్ర‌భుత్వమే చేయ‌గ‌ల‌దు. ప్ర‌తిపాద‌న‌లు పంప‌టం వ‌ర‌కే రాష్ట్ర‌ప్ర‌భుత్వం చేతిలో ఉంది. అంద‌రికీ తెలిసిన ఈ విష‌యం ముద్ర‌గ‌డ‌కు తెలీదా?

వాస్త‌వాలు ఈ విధంగా ఉంటే ముద్ర‌గ‌డ ఆరోప‌ణ‌లు మాత్రం వేరే విధంగా ఉంది. కాపుల‌ను ఆదుకోవ‌టానికే కార్పొరేష‌న్ కు ఇప్ప‌టిక‌న్నా రెట్టింపు నిధులిస్తాన‌ని జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న ముద్ర‌గ‌డ ప‌ట్టించుకోవ‌టం లేదు. కాపు జాతి ఏం త‌ప్పుచేసిందో చెప్పాలంటూ జ‌గ‌న్ ను ముద్ర‌గ‌డ నిల‌దీయ‌టం విచిత్రంగా ఉంది. రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో వాస్త‌వాన్ని చెప్పారేకానీ రిజర్వేష‌న్ల‌కు తాను వ్య‌తిరేకమ‌ని ఎక్క‌డా జ‌గ‌న్ చెప్ప‌లేదు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించ‌టం కేంద్రం ప‌రిధిలోని అంశ‌మ‌ని జ‌గ‌న్ నిజాన్ని చెప్ప‌టమంటే కాపుల‌ను అవ‌మానించ‌టం ఎలాగ‌వుతుందో ముద్ర‌గ‌డే చెప్పాలి.