Home సినిమా హరితహారం చాలెంజ్‌ను స్వీకరించిన మహేశ్‌బాబు..

హరితహారం చాలెంజ్‌ను స్వీకరించిన మహేశ్‌బాబు..

SHARE

ఎన్నో సామాజిక విషయాల్లో చాలెంజ్‌లు విసురుతూ సోషల్‌ మీడియా వేదికగా వైరల్‌ అవుతున్నాయి. మొన్నామధ్య క్రీడా శాఖా మంత్రి రాజ్యవర్ధన్‌ విసిరిన హమ్‌ ఫిట్‌తో ఇండియా ఫిట్‌ చాలెంజ్‌ ఎంత పాపులర్‌ అయిందో వేరే చెప్పనక్కర్లేదు.

తాజాగా హరితహారం చాలెంజ్‌ వైరల్‌గా మారుతోంది. కేటీఆర్‌ విసిరిన హరితహారం చాలెంజ్‌ను స్వీకరించిన టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు తన తోటలో మొక్కను నాటారు. ఈ ఫొటోను ట్విట్టర్‌ పోస్టు చేసిన మహేశ్‌ మంత్రి కేటీఆర్, రాచకొండ పోలీసులు ఇచ్చిన చాలెంజ్‌ను స్వీకరించానని పేర్కొన్నాడు.

గ్రీన్ చాలెంజ్‌కు తనను నామినేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపాడు. పర్యావరణానికి ఈ చాలెంజ్ ఎంతో మేలు చేస్తుందన్న మహేశ్.. తన ఇద్దరు బిడ్డలు సితార, గౌతమ్‌లతోపాటు దర్శకుడు వంశీలకు చాలెంజ్ విసిరాడు.