Home రాజకీయాలు యూ టర్న్ అనేది నా వంట్లో ఇంట్లో లేదు: జగన్

యూ టర్న్ అనేది నా వంట్లో ఇంట్లో లేదు: జగన్

250
SHARE

కాపు రిజర్వేషన్ ల పై విపక్ష నేత జగన్ అన్న మాటలు తెదేపా మీడియా వక్రీకరించటం తెలిసిందే. పాదయాత్ర లో వున్న జగన్ ఈ రోజు…బాబు గారి పాంప్లేట్ (టీడీపీ మీడియా) చూశా, కాపుల గురించి ఆందోళన చేయాలని చంద్రబాబుగారు చెప్పారని అందులో రాసారు, కాపుల రిజర్వేషన్ ల గురించి జగ్గంపేటలో నేను చెప్పిన మాటలు వక్రీకరించారు అన్నారు. బాబు, కొంతమంది పెద్దలు, ఇంకా చంద్రబాబు ఎల్లో మీడియా ప్రయత్నాలు చూశాక రాజకీయాలు ఇంత నీచంగా మారాయా అనిపించింది అని వాపోయారు.

ఎవరు మోసం చేసింది అని జగన్ అడిగారు, కాపు సామాజికవర్గానికి బాబు చేసిన మోసం తెలుసు. ఎన్నికలకు ముందు ఓ మాట చెప్పి ఎన్నికల అనంతరం చేయకపోతే దాన్ని మోసమంటారు. రిజర్వేషన్ ల పై మాట్లాడుతూ వివిద రాష్ట్రాలలో రిజర్వేషన్లు కోసం పోరు జరుగుతున్నాయి. గుజ్జర్లు, జాట్ లు ,పటేళ్లు, ఇంకా ఎపి లో కాపులు రిజర్వేషన్ కోరుతున్నారు. కానీ రిజర్వేషన్ లు 50% దాటకూడదని సుప్రింకోర్టు చెప్పింది. అందుకే ఎన్నో ఏళ్ళ తరబడి ఇది పరిష్కారం కావడం లేదు, అటువంటి సమస్యపై బాబు నేను చేసేస్తానని చెప్పడాన్ని ఏమంటారు…మోసం కాదా అని జగన్ ప్రశ్నించారు.

ఆరు నెలల్లో రిజర్వేషన్ లు ఇస్తానని చెప్పిన బాబు మోసగాడు ఔతాడా లేక కాపుల ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తుంటే అండగా ఉన్న తానా మోసగాడిని అని జగన్ ప్రశ్నించారు. కాపు ఉద్యమం తీవ్రం రూపం దాల్చాక కమిషన్ వేశారని ఇక నివేదిక చైర్మన్ సంతకం కూడా లేకుండా అసెంబ్లీలో పెట్టి తీర్మానం కూడా చేసేసి కంటితుడుపుగా కేంద్రానికి పంపింది బాబా కాదా అని జగన్ ప్రశ్నించారు.

నాలుగేళ్లు బిజెపి, టిడిపి లు సంసారం చేశాయని, మరి అంతకాలం ఎందుకు హామీ ని నిలబెట్టుకోలేదని జగన్ అన్నారు. బాబు లాగా గాల్లో మాటలు చెప్పనని అన్నారు. కాపు కార్పోరేషన్ కోసం ఇంతవరకూ కేవలం 1340 కోట్లు మాత్రమే ఇచ్చారని అది మోసమని జగన్ అన్నారు. తాను పదివేల కోట్ల ఇస్తానని చెప్పడం మోసమా అని అడిగారు. కాపు లకు రిజర్వేషన్ విషయంలో తమ వైఖరి ఒకటేనని, యుటర్న్ తన వంట్లో ఇంట్లో లేదని అన్నారు.

బిసిలకు నష్టం కాకుండా కాపులకు రిజర్వేషన్ లు ఇవ్వాలన్నదే తమ విదానం అని జగన్ ప్రకటించారు. కానీ ఎల్లో మీడియా దీన్ని నీచంగా ప్రచారం చేసిందని అన్నారు. మొత్తం అన్ని కులాలవారిని మోసం చేసిన ఘనత బాబుకే దక్కుతుందని జగన్ ద్వజమెత్తారు. తాను మోసం చేయనని, అబద్దం చెప్పనని స్పష్టం చేసారు.