Home సినిమా మరో సారి ఎన్ఠీఆర్ తో….

మరో సారి ఎన్ఠీఆర్ తో….

SHARE

కొరటాల శివ సినిమాలు సందేశాత్మకంగా వున్నా మంచి కమర్షియల్ హంగులు కలిగి వుంటాయి. అందుకే బాక్స్ ఆఫీస్ శివ గారి సినిమాలకు ఫిదా అవుతూ ఉంటుంది. నాలుగు సినిమాలు తీసి అన్ని బ్లాక్బస్టర్ లు కావటం ఓ అరుదైన రికార్డు. ఇక శివ సినిమాలు ఏదో ఒక సోషల్ మెసేజ్ చుట్టూ తిరుగుతుంటాయి. ఆ కాన్సెప్ట్ తో అన్ని హిట్స్ ఇచ్చాడు ఈ దర్శకుడు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను, ఇలా నాలుగింటి లోనూ మెసేజ్ వుంది.

తాజా గా ఎన్టీఆర్ తో రెండో సినిమా చేయబోతున్నాడు కొరటాల శివ. వీరిద్దరి జోడి ‘జనతా గ్యారేజ్’ వంటి భారీ హిట్ ఇచ్చింది. ఆ సినిమా ఎన్టీఆర్ కెరియర్లోనే చెప్పుకోదగ్గ సినిమాగా నిల్చింది. అలాంటి సినిమా తరువాత ఎన్టీఆర్ తో ఇంకో సినిమా చేయడానికి కొరటాల గ్రౌండ్ వర్క్ బెగిన్ చేసినట్టు ఫిల్మ్ నగర్లో టాక్.

కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ ఆ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. సై రా తరువాత కొరటాల చిరు ల కాంబినేషన్ లో ఓ సినిమా వుంది. అటు పిమ్మట ఎన్ఠీఆర్ తో సినిమా…అంటే బహుశా ౨౦౧౯ చివర్లో బెగిన్ అవ్వొచ్చు!!