Home రాజకీయాలు శివాజీ మళ్ళా మైకందుకున్నాడు

శివాజీ మళ్ళా మైకందుకున్నాడు

539
SHARE

జన సేన అధినేత పవన్ కల్యాణ్‌పై నటుడు శివాజీ ఫైరయ్యారు. గుంటూరు కేజేఎస్ఎస్ కళాశాల ప్రాంగణంలో గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు అధ్యక్షతన ‘మేధావుల మౌనం – సమాజానికి శాపం’ అనే సదస్సు లో శివాజీ ప్రసంగించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఆపేస్తాను అంటూ చేసిన పవన్ వ్యాఖ్యల పై మండిపడ్డారు. అమరావతిని ఆపేస్తామంటున్న వారు రాజధానిని ఎక్కడ నిర్మిస్తారో చెప్పాలని నిలదీశారు.

జగన్‌, పవన్ లు ప్రత్యేక హోదా అంశాన్ని తమ రాజకీయ లబ్ధికోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రంపై పోరాడకుండా చంద్రబాబుపై ఆరోపణలు చేయడం వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. ప్రధాని 54 దేశాలు తిరిగినా ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయారని, కానీ చంద్రబాబు రూ.లక్షల కోట్ల విలువైన పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చారని శివాజీ గుర్తు చేశారు.

ఇంకా ఎన్నికలపై మాట్లాడుతూ ఈ సారి కేంద్రంలో వచ్చేది సంకీర్ణమేనని అంతా ఒక్క తాటిపై నిలబడితే ప్రత్యేకహోదా వచ్చి తీరుతుందన్నారు. హోదా కోసం రైళ్లను ఆపదం కేంద్రప్రభుత్వ సంస్థలను అడ్డుకునేందుకు తాను సిద్ధం అని చిత్త శుద్ధి ఉన్నవారు తనతో కలిసి రావాలని సవాలు విసిరారు.

హోదా పోరు కీలక దశకు చేరుకుందని, యువకులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ యువతకు సూచించారు.

అన్నట్టు శివాజీ అప్పుడెప్పుడో హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అన్నారు….మర్చిపోయారేమో గుర్తుచేయండి ఆయనకీ ఎవరైనా ప్లీజ్…!!