Home రాజకీయాలు జగన్ వాస్తవిక వాది: తెదేపా ఎంఎల్ఏ

జగన్ వాస్తవిక వాది: తెదేపా ఎంఎల్ఏ

SHARE

వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ మోహన్ రెడ్డి కాపుల రిజర్వేషన్ లపై చేసిన వ్యాఖ్యలు పలు రాజకీయ పార్టీలు వివిధ కోణాల్లో వాడుకుంటున్నాయి. తెదేపా నాయకులు జగన్ ఘోరమైన అపరాధం చేసినవాడిలా చిత్రీకరిస్తున్నాయి.

అయితే చిత్రం గా తెలంగాణా తెదేపా నాయకుడు మరియు బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మాత్రం జగన్ ని కొనియాడారు. విపక్ష నేత వ్యాఖ్యలు వాస్తవానికి అద్దం పట్టాయని కృష్ణయ్య అన్నారు. జగన్ చెప్పిన దా౦ట్లొ తప్పు ఏమిటో చెప్పమన్నారు.

ఆచరణ సాధ్యం కాని హామీ, సాధ్యం కానీ విషయం గురించి మాట్లాడడానికి జగన్ ఇష్టపడ లేదని. దీని పై అనేక రకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ ఓ రాజకీయవాదిగా కాకుండా వాస్తవికవాది గా చెప్పారని కృష్ణయ్య అన్నారు. కాపు రిజర్వేషన్ వ్యవహారం కేంద్రం పరిధిలో ఉన్న మాట వాస్తవమే కదా అని ఆయన అన్నారు. అయినా జగన్ కాపు రిజర్వేషన్ లకు తమ పార్టీ వ్యతిరేకం అని ఏమి అనలేదుగా ఇది కేంద్రం పరిధిలోని అంశమని మాత్ర౦ ఆయన అన్నారు. వ్యతిరేకం అయి ఉంటే కాపు ఉద్యమ పోరాటానికి వైకాపా మద్దతు ఎందుకు ఇస్తుంది?