Home రాజకీయాలు గల్లా అడిగారు బావుంది….టైమింగే మిస్ అయ్యారు పాపం!

గల్లా అడిగారు బావుంది….టైమింగే మిస్ అయ్యారు పాపం!

356
SHARE

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, విజయవాడ ఎయిర్ పోర్టుల నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని నడపాలని గుంటూరు ఎంపీ, టీడీపీ నేత గల్లా జయదేవ్ కేంద్రాన్ని కోరారు.

పార్లమెంట్ లోక్ సభ సమావేశాల్లో గుంటూరు ఎం పీ ఈ రోజు మాట్లాడుతూ ఈ రెండు విమానాశ్రయాలను మూడేళ్ల క్రితమే అంతర్జాతీయ ప్రమాణాలతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీర్చిదిద్దినప్పటికీ ఇంకా విమాన సర్వీసులను నడపకపోవడంలో ఏమిటి కేంద్రం అంతర్యం అని గల్లా ప్రశ్నించారు.

విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల నుంచి అమెరికా, సింగపూర్, ఇంకా పశ్చిమాసియా దేశాలకు సర్వీసులని నడుపుతామని కేంద్రం గతంలోనే ప్రకటించిన విషయాన్ని ఎం పీ గుర్తుచేశారు. మూడేళ్ల క్రితమే వీటిని అంతర్జాతీయ విమానాశ్రయాలుగా ప్రభుత్వం గుర్తించింది అని గల్లా చెప్పారు. కేంద్రం ఇచ్చిన మాట ప్రకారం విజయవాడ, తిరుపతి నుంచి అంతర్జాతీయ సర్వీసులతో పాటు విజయవాడ ఎయిర్ పోర్ట్ లో కార్గో సేవల్ని ప్రారంభించాలని కేంద్ర పౌర విమానయాన శాఖను డిమాండ్ చేశారు.

ఎం పీ గారి డిమాండ్ బావుంది…అయితే మొన్నటి దాకా కేంద్ర పౌర విమాన యాన శాఖ మినిస్టర్ గా తెదేపా నేత అశోక గజపతిరాజు గారే అన్న విషయం మర్చిపోయారా గల్లా సార్ లేక అప్పుడు అడగటానికి మొహమాటం అడ్డొచ్చిందాండి?