Home ప్రత్యేకం వైకాపా ఎస్ సి ఓట్లకు గండికొట్టడానికి బాబు కొత్త ఎత్తుగడ!

వైకాపా ఎస్ సి ఓట్లకు గండికొట్టడానికి బాబు కొత్త ఎత్తుగడ!

343
SHARE

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు రాజ‌కీయ చాణక్యుడు. ఆయ‌న రాజకీయ చ‌రిత్ర‌ గ‌మ‌నిస్తే ఎంతో మంది ప్రత్యర్థులను ఆయన ఎదుర్కొనే తీరు బహు చిత్రంగా ఉంటుంది; ప్ర‌త్య‌ర్థుల‌ను నేరుగా ఎదుర్కొట౦, ఇత‌రుల స‌హాయంతో ఎదుర్కొట౦, ప్ర‌త్య‌ర్థి పార్టీ లో చిచ్చు రేపి పై చేయి సాధి౦చటం లాంటివి కొన్నైతే తాజాగా ఏపీ లో ప్రత్యర్థి జగన్ పార్టీ ని ఎదుర్కోటానికి చంద్ర‌బాబు ఇంకో పార్టీ ని గట్టిగా సపోర్ట్ చేసే ప‌నిలో ఉన్నారనే ప్ర‌చారం ఊపందుకుంది.

ఎస్సీలు బాబుకి వ్య‌తిరేకమనే ప్రచార౦ ఉందనే వుంది. వారి ఓట్లు చీల్చడ౦ అనే సూత్ర౦ తో బాబు కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. బీఎస్పీని ముందుకు తీసుకొచ్చి వైకాపా ఎస్సీ వోట్లకి గండికొట్టడం అనే సూత్రమే ఇది. బీఎస్పీ ద్వారా చదువుకున్న ఎస్సీల ఓట్ల‌ను చీల్చడమే బాబు ప్ర‌య‌త్న౦.

బీజేపీ తో జ‌గ‌న్ మైత్రి అంటూ ప్ర‌చారం చేయిస్తూ క్రిస్టియ‌న్ ఓటర్లలో అనుమాన౦ పెంచారు ఇక ఈ టైం బీఎస్పీ ని పోటీలో నిలబెట్టగలిగితే ఎస్సీల ఓట్లు కచ్చితంగా చీల్చొచ్చు అనే ఎత్తుగడతో పని చేస్తున్నారు వినికిడి. బాబు ప్రయత్నాలు ఎంత వరకు వైసీపీకి నష్టం చేయగలవో వేచి చూడాలి!!