Home రాజకీయాలు మరో సారి కాల్ మనీ రక్కసి ….సెల్ఫీ సూసైడ్!

మరో సారి కాల్ మనీ రక్కసి ….సెల్ఫీ సూసైడ్!

130
SHARE

కృష్ణా జిల్లాలో మరో సారి ‘కాల్ మనీ ‘ రక్కసి విరుచుకుపడింది. వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక ఉయ్యూరు మండలం తోట్లవల్లూరు గ్రామంలో రాంబాబు అనే వ్యక్తి చనిపోవటం బాధాకరం.

రాంబాబు సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్య చేసుకోటం పోలీస్ వర్గాలని కలవరపాటుకు గురిచేశాయి.
బీఎస్ఎన్ఎల్ లో పని చేసే రాంబాబు కొంతకాలం క్రితం విజయ నిర్మల, అరిగే శ్రీనుల వద్ద వందకు నెలకు 16 నుంచి 20 రూపాయల చొప్పున లక్ష రూపాయలు లోనుగా తీసుకున్నాడు. పాపం అసలు తీర్చలేక పోవడంతో ఇల్లు అమ్మి అప్పు తీర్చాలని వారు వత్తిడి చేస్తూ వచ్చారు. వారి వేధింపులు భరించలేక రాంబాబు ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ కాల్ మనీ ఆత్మహత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన తండ్రి జూన్ 26న ఆత్మహత్య చేసుకున్నారని ఆయన కూతురు సెల్ఫీ వీడియోను పోలీసులకు అందజేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు …అయితే ఇంతవరకూ ఒక్క అరెస్ట్ కూడా జరగలేదు.