Home సినిమా వివాదాలతో చిత్ర ప్రమోషన్ స్ట్రాటజీ ఏంటో విజయ్ కే తెలియాలి!!

వివాదాలతో చిత్ర ప్రమోషన్ స్ట్రాటజీ ఏంటో విజయ్ కే తెలియాలి!!

72
SHARE

బ౦డబూతుల వాట్‌ ద F** పాట యూట్యూబ్ నుండి డిలీట్. ఫ్రస్ట్రేటెడ్‌ సింగర్‌ అంటూ విజయ దేవరకొండ స్వయంగా ప్రమోట్ చేసుకున్న ‘వాట్ ది F**’ సాంగ్‌ తనే ఆలపించారు. ‘అర్జున్ రెడ్డి’ చిత్రం విడుదలకు ముందే ఈ ‘ఎఫ్’ బూతుని విరివిగా ఉపయోగించి యూత్ ని విపరీతంగా ఆకర్షించారు విజయ్. అదే ట్రాక్ లో ఇప్పుడు ‘గీతా గోవిందం’ సినిమా ప్రమోషన్ కి కూడా ఉపగించాలని అనుకున్నట్టున్నారు. అచ్చొచ్చిన ‘ఎఫ్’ బూతుని హైలైట్ గా చేస్తూ పాట౦దుకున్నాడు విజయ్. కానీ అది బూమరాంగ్ అయ్యి చిత్ర సమర్పకులు కొంచం చేదుని మిగిల్చింది….యూట్యూబ్…నుండి పాత డిలీట్ అవ్వడమే కారణం.

ఎఫ్ బూతు పెద్ద విషయం కాకపోయినా సాంగ్‌లో లిరిక్స్‌ చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. ‘అమెరికా గాళ్‌ అయినా.. అంటూ వచ్చిన ఈ పాటలో సావిత్రి మొదలు సీత దాకా ఎవర్నీ వదలేకుండా అభ్యంతరకర మాటలతో ఫుల్ గా వాడుకున్నాడు విజయ్. అయితే పురాణాల మీద వున్న విశ్వాసాన్ని దెబ్బతీసేలా పాట ఉండటంతో పలు ధార్మిక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడం తో పాటు సోషల్ మీడియా లో కూడా ట్రోలింగ్ వల్ల చిత్రయూనిట్ పాటను యూట్యూబ్‌ నుండి డిలీట్ చేశారు. అసలు వివాదాలతో చిత్ర ప్రమోషన్ ఏంటో…ఆ స్ట్రాటజీ ఏంటో విజయ్ కే తెలియాలి.