Home సినిమా శ్రీ రెడ్డి కి అవకాశాలు ఇస్తా అంటూ ముందుకొచ్చిన నిర్మాత!!

శ్రీ రెడ్డి కి అవకాశాలు ఇస్తా అంటూ ముందుకొచ్చిన నిర్మాత!!

139
SHARE

తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందంటూ ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు శ్రీ రెడ్డి. టాలీవుడ్ తో ఆగక తమిళ చిత్రపరిశ్రమపై కూడా ఇటువంటి ఆరోపణలే చేశారు. కానీ శ్రీ రెడ్డికి లభించిన మద్దతు చాలా తక్కువ…పట్టువదలకుండా న్యాయం కోసం పోరాట౦ ఆపని శ్రీ రెడ్డి కి అవకాశం ఇస్తానని ప్రముఖ నటి, నిర్మాత కుట్టి పద్మిని అన్నారు.

చెన్నైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కుట్టి పద్మిని మాట్లాడుతూ శ్రీరెడ్డి గురించి ప్రస్తావించారు. శ్రీరెడ్డి తో తాను కలిసి పని చేయాలనుకుంటున్నట్లు తెలియ చేశారు. తాను నిర్మించే ధారావాహికల్లో శ్రీరెడ్డి కి పాత్రలు ఇస్తానని ప్రామిస్ చేశారు.

శ్రీ రెడ్డి ఆరోపణల్లో నూరు శాతం నిజం ఉందని కూడా కుట్టి పద్మిని అన్నారు. 1980ల లోనే ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందని ఆరోపించారు. ప్రస్తుతం శ్రీ రెడ్డికి కావాల్సింది ఓదార్పు అని, ఆమెకు కనక అవకాశాలు ఇస్తే తన టాలెంట్ ని నిరూపించుకుంటుందని వెల్లడించారు.

అతి పిన్న వయసులోనే తమిళ చిత్ర పరిశ్రమలో బాల నటిగా కుట్టి పద్మిని అడుగుపెట్టారు. అటు పిమ్మట తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం తమిళ ధారావాహికలను నిర్మిస్తున్నారు.