Home రాజకీయాలు టీడీపీతో పొత్తుపై…లౌక్యంగా అమిత్ షా!

టీడీపీతో పొత్తుపై…లౌక్యంగా అమిత్ షా!

161
SHARE

రానున్న సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం, శివసేనలతో భాజపా పొత్తు పెట్టుకుంటుందా అన్న ప్రశ్నకు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా స్పందించారు. ఓ ఇంగ్లిష్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివిధ అంశాల గురించి తన అభిప్రాయాలు తెలియచేసిన షా… తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి బయటకు వెళ్లి పోవడం గురించి ఎక్కువ ఆలోచించాల్సిన పనిలేదని అన్నారు. శివసేన విమర్శల గురించి కూడా ఎక్కువగా స్పందించలేదు షా.

పొత్తులనేవి ఏర్పడటం, విడిపోవడం అనేవి రాజకీయాల్లో జరుగుతూ ఉంటుందని షా వ్యాఖ్యానించారు. అయితే తెలుగుదేశం పార్టీ, శివసేనలతో రానున్న ఎన్నికల్లో పొత్తు కచ్చితంగా ఉండదని కూడా షా చెప్పలేదు. ఇంకా పొత్తుల గురించి ఇంత తొందరగా మాట్లాడటం తగదని అన్నారు. ఎన్నికల సమయంలోనే ఈ అంశంపై తమ స్పందన ఉంటుందని అన్నారు.

అయితే విచిత్రంగా ఎన్డీయేని౦చి విడిపోయిన తెదేపా శివసేనల పట్ల ఓవర్ గా రియాక్ట్ కాకుండా, పొత్తు ఉండదు అని కూడా కుండబద్ధలు కొట్టకుండా.. అతి లౌక్యంగా బీజేపీ జాతీయాధ్యక్షులు స్పందించటం గమనార్హం.

బీజేపీ వ్యతిరేక పార్టీల కూటమి పట్ల షా మాత్రం ఘాటుగా స్పందించారు. ఆ పార్టీలన్నీ ప్రజా తిరస్కరణకు గురిఅయినవే అని చెప్పి వాటికి తాము అసలు భయపడడ౦ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు వచ్చే సీట్ల సంఖ్య ఇంకా పెరుగుతుందన్న ఆశాభావ౦ వ్యక్తం చేశారు షా!