Home రాజకీయాలు జగన్‌ను విమర్శించే అర్హత పవన్ కి ఉందా??

జగన్‌ను విమర్శించే అర్హత పవన్ కి ఉందా??

SHARE

వైసీపీ నేత ఆళ్ళ నాని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విరుచుపడ్డారు. పవన్ కు వైఎస్సార్సిపీ అధినేత జగన్ ని విమర్శించే అర్హత లేదు అని ధ్వజమెత్తారు. ప్రజా సంక్షేమం కోసం పాటు పడే జగన్ ను పవన్ కల్యాణ్ ఏ అర్హతతో విమర్శిస్తున్నారో అని నాని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధికి బీజం వేసిందే వైస్సార్ అని ఈ విషయంలో తాను చర్చకు సిద్ధమని జనసేన నేతలు ఎవరైనా చర్చకు రావొచ్చని సవాల్ విసిరారు.

పవన్ కల్యాణ్ అన్న చిరంజీవి రెండేళ్లు కేంద్రమంత్రిగా ఉండి కూడా పశ్చిమగోదావరి జిల్లాకు ఒరగబెట్టింది ఏమీ లేదని నాని అన్నారు. పవన్ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు కనకే పోలవరం ప్రాజెక్టులో అవినీతి గురించి నోరు మెదపడం లేదని నాని అన్నారు. జనసేన పార్టీ వి అనైతిక రాజకీయాలు అని, అందుకే వైఎస్ కుటుంబ సభ్యుల గురించి జన సేన అభిమానులు ఇష్ట౦ వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు.

అసలు అవిశ్వాసానికి అనుకూలంగా ఎంపీ లను కూడ గడతాను అని చెప్పిన పవన్ ఢిల్లీలో వైఎస్సార్సీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు ఎక్కడకు పోయారని నాని ప్రశ్నించారు. వైకాపా తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలతో చంద్రబాబు నాయుడు పార్టీ ఫిరాయించేలా చేసినా పవన్ నోరు మెదపడని నాని అన్నారు. సమస్యలపై అసెంబ్లీ లో మాట్లాడనీయకుండా చేస్తున్న అధికారపార్టీ నిర౦కుశత్వాన్ని ప్రజా క్షేత్రంలో జగన్ ప్రతి రోజూ ఎండగడుతున్నారని నాని అన్నారు.

ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారని.. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించే వారందరికీ కూడా తగిన సమయం వచ్చినప్పుడు బుద్ధి చెబుతారని నాని అన్నారు!!