Home రాజకీయాలు కాపు రిజర్వేషన్ లపై నిజాయితీగా స్పందించిన జగన్!

కాపు రిజర్వేషన్ లపై నిజాయితీగా స్పందించిన జగన్!

171
SHARE

ఎన్నికలు దగ్గరవుతున్న తరుణ౦ లో ఏపీ లోని ప్రధాన సామాజిక వర్గమైన కాపుల రిజర్వేషన్
అంశమై జగన్ కుండబద్దలు కొట్టారు. తాను చెయ్యగలిగింది మాత్రమే చెప్తాను, చేయలేనిది ఎప్పుడు చెప్పను అని చెప్పిన విపక్ష నేత, కాపుల రిజర్వేషన్లు కల్పించలేనని చెప్పారు. రేజర్వేషన్లు 50 శాతం దాటి ఉండటంతో రిజర్వేషన్ రాష్ట్రం పరిధి లో ఉండదన్నారు. ఇది సుప్రీంకోర్టు పరిధిలో ఉందని తెలియ చేశారు జగన్.

ప్రజాసంకల్ప యాత్ర చేస్తోన్న జగన్, ఈ రోజు సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట బహిరంగ సభలో ప్రసంగి౦చారు. అక్కడ కాపు రేజర్వేషన్ల ప్రస్తావన తీసుకొచ్చారు. తాను చేయలేని పరిస్థితుల్లో మాటివ్వలేక పోతున్నట్టు జగన్ చెప్పారు. కానీ అసలు కాపులకు అన్యాయం జరుగుతుందన్న వాదనా, పోరాటం మొదలు పెట్టింది తానేనని గుర్తు చేశారు.

అయితే కాపు కార్పొరేషన్‌కు ఏడాదికి బాబు కేటాయించిన నిధులకు (రూ.5 వేల కోట్లు) రెట్టింపు నిధులు తాను కేటాయిస్తానని మాట ఇచ్చారు జగన్. బాబు ప్రతి కులానికి అమలు చేయని హామీలిచ్చారని జగన్ దుయ్యబట్టారు.

కాపులకు రిజర్వేషన్లు విషయంలో అత్యంత కీలక నిర్ణయాన్ని తూగో జిల్లాలో ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అమలుచేయలేని మాట ఇవ్వను కానీ కాపులకు అండగా ఉంటాను అని జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారి వేడి పెంచాయి. గతంలో కాపుల ఆందోళనకు వైకాపా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే…అందుకే ఎన్నికల ముందు ఈ నిర్ణయాన్ని స్పష్టంగా వెల్లడించడం విశేషం.