Home రాజకీయాలు “జగన్ గారు బాబును ఎదుర్కోలేకే మీరు పారిపోతున్నారు “

“జగన్ గారు బాబును ఎదుర్కోలేకే మీరు పారిపోతున్నారు “

SHARE

విపక్ష నేత వైస్ జగన్ పై మరో మారు చెలరేగి పోయారు జన సేన అధినేత పవన్ కళ్యాణ్. పశ్చిమ గోదావరి జిల్లా లో భీమవరం లో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ, ‘జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నా చంద్రబాబుగారిని ఎదుర్కొనే శక్తి, దమ్మూ ధైర్యం మీకు లేకే మీరు అసెంబ్లీ నుంచి పారిపోతున్నారు. చంద్రబాబు గారిని ఎదుర్కోండి….!!

నేనే కనక మీ స్థానంలో ఉండుంటే….ప్రభుత్వాన్ని ఓ ఊపు ఊపేసేవాడ్ని. ప్రతిపక్షనాయకుడికి వుండే శక్తి మీకే౦ తెల్సు? మీరు ప్రజాస్వామ్య వ్యవస్థను వాడుకోవటంలేదు. ఆ విషయాలపై నేను మాట్లాడుతుంటే నాపై వ్యక్తిగత విమర్శలా….?

పవన్ కల్యాణ్ జీవితం తెరిచిన పుస్తకం. ఏదీ దాయడు. చాలా మంది జీవితాల్లో కనపడని పేజీలు౦టాయి….కానీ నా జీవితం అలా కాదు…..దాపరికాలు లేవు…..తెరిచి ఉంచిన పుస్తకమే’ అంటూ పవన్ జగన్ పై మరోసారి విరుచుకుపడ్డారు!